ETV Bharat / politics

ఆ రెండు జిల్లాల్లో వైసీపీని వెంటాడుతున్న ఓటమి భయం- అభ్యర్థుల మార్పిడి ఖాయమనే సంకేతాలు! - AP Elections 2024 - AP ELECTIONS 2024

Amaravati Effect on YSRCP Candidates : ఎన్నికల సమరంలో దిగకుండానే వైఎస్సార్సీపీ అస్త్ర సన్యాసం చేస్తోంది. పోలింగ్ తేది దగ్గరపడుతున్నా కొద్దీ పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరడం ఆ పార్గీని కలవరపాటుకు గురిచేస్తోంది. ఏపీ రాజధాని అమరావతి ఎఫెక్ట్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ అభ్యర్థలపై తీవ్రంగా భయపెడుతోంది. ఈ నేపథ్యంలో మెజార్టీ స్థానాల్లో అభ్యర్థుల మార్పు దిశగా అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

AMARAVATI EFFECT ON YSRCP
Amaravati Effect on YSRCP Candidates
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 5:48 PM IST

Amaravati Effect on YSRCP Candidates : ఓ వైపు బలమైన ప్రత్యర్థులు, మరోవైపు ద్వితీయ శ్రేణి వలసలు, ఇంకో వైపు రోజురోజుకూ ప్రజల్లో వ్యతిరేకత వెరసి ఓటమి తప్పదన్న సంకేతాల నేపథ్యంలో అధికార పార్టీ వైఎస్సార్సీపీ అభ్యర్థులు పోటీకి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని అమరావతి ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. పరిస్థితులను పసిగట్టిన అధిష్ఠానం ఆయా జిల్లాల్లోని మెజార్టీ స్థానాల్లో మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వలసలు : గుంటూరులో వైసీపీ ఎంపీ అభ్యర్థి రోశయ్య పోటీకి విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, వైసీపీ నుంచి వలసలు కొనసాగుతున్న తరుణంలో పోటీ చేయలేనంటూ చేతులెత్తేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిల్లా పరిషత్​ ఛైర్​ పర్సన్​ కత్తెర క్రిస్టినా వైఎస్సార్సీపీకి రాజీనామా చేయడం పుండు మీద కారం చల్లినట్లుగా మారింది.

పార్టీ కార్యక్రమాలకు గతకొంత కాలంగా ఆమె దూరంగా ఉంటున్నారు. క్రిస్టినా భర్త కత్తెర సురేష్ కుమార్ తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్​ఛార్జ్​గా పని చేస్తూ టికెట్ ఆశించారు. కానీ, వైసీపీ అధిష్ఠానం సుచరితను ప్రకటించడంతో కార్యకర్తల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీంతో దంపతులిద్దరూ టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

అరాచక 'గ్రంథం' - గోదావరి జిల్లాల్లో పేట్రేగిపోతున్న వైసీపీ నేత - YSRCP Leader Irregularities

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని ఎఫెక్ట్ : ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపోటములపై రాజధాని ప్రభావం ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. అమరావతిని రాజధాని చేస్తామని, ఇక్కడే నివాసం ఉండేందుకు ఇల్లు కూడా కట్టుకుంటున్నామని గత ఎన్నికలకు ముందు జగన్ ప్రకటించడం తెలిసిందే. అటు సొంత పార్టీ అభ్యర్థులతో పాటు ప్రజలను నమ్మించి ఓట్లు దండుకున్న జగన్​ ఆ తర్వాత అమరావతిని పక్కన పెట్టేశారు. మూడు రాజధానులు అంటూ తాను విశాఖకు మకాం మార్చేందుకూ యత్నించారు. ఈ నేపథ్యంలో ఆ రెండు జిల్లాల్లో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు తెలుస్తోంది.

మొక్కుబడి ప్రచారం, ధనబలంపైనే నమ్మకం : ఓటమి తప్పదన్న సమాచారం, అంతర్గత సర్వేల ఫలితాల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థులు ఎన్నికల్లో మొక్కుబడిగా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లకుండా ధనబలాన్నే నమ్ముకుని పంపకాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వస్త్రాలు, గిఫ్ట్​లు ఎరవేసి టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు అప్రమత్తమై అడ్డుకుంటున్న పరిస్థితుల్లో ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారు.

మెజార్టీ స్థానాల్లో మార్పులు ఖాయం : నియోజకవర్గ ఇన్​చార్జుల నియామకం, అభ్యర్థుల ఎంపికలో పలు దఫాలుగా మార్పులు చేసిన తాడేపల్లి క్యాంపు కార్యాలయం, ఏక కాలంలో 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకోవడం విదితమే. కాగా, జాబితాలో మరిన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. కొన్ని స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, మరికొన్ని నియోజకవర్గాల్లో స్థానికేతరులకు అవకాశమిచ్చారంటూ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించే దిశగా మార్పులు ఖాయమన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీ కోడ్‌ అమలు చేస్తున్న ఖాకీలు - జగన్‌ భక్త అధికారుల అత్యుత్సాహం - AP Elections 2024

'ఆయ్ అండీ, గాలి మారిందండీ' ఇదీ గోదావరి జిల్లాల ఓటర్‌ మనోగతం - AP Elections 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.