Investigation in Supreme Court on sand mining : రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్న విషయం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ కమిటీ ఇచ్చిన నివేదిక స్పష్టం చేస్తోందని ఈ వ్యవహారంపై ఎన్జీటీ (NGT) లో పిటిషన్ వేసిన దండా నాగేంద్ర అన్నారు. అక్రమ తవ్వకాలు దాచిపెట్టి తప్పుడు నివేదికలు ఇచ్చిన కలెక్టర్లు భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలో ఇసుక దొంగలపై జగన్ సర్కారు సమాధానమెంటీ
ఎన్జీటీ ఈ కేసుని సుప్రీం కోర్టుకు అప్పగించిందంటే తప్పనిసరిగా అక్రమార్కుల ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉందని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. అధికార యంత్రాంగంతో పాటు ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.
కృష్ణా నదిలో అక్రమ తవ్వకాలు - అడ్డుకోవాలని కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశాలు
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) కనుసన్నల్లోనే ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని మేం మొదటి నుంచి చెప్తున్నాం. కానీ, ఆలాంటిదేమీ లేదంటూ 21మంది కలెక్టర్లు ఇచ్చిన నివేదిక పూర్తి అవాస్తవం. వారంతా ఇచ్చిన నివేదిక ఒకే ఫార్మాట్లో ఉండడాన్ని గమనిస్తే ఎంత నీచానికి ఒడిగట్టారో అర్థమవుతోంది. కళ్లెదుటే వందల లారీల కొద్దీ ఇసుక తరలి పోతుంటే వారంతా కళ్లుమూసుకున్నారా? అనేది అర్థం కావడం లేదు. అవినీతి ముఖ్యమంత్రికి సహకరిస్తూ దోచిపెడుతున్నట్లుగా ఉంది. శాటిలైట్ విజువల్స్ 2021 నుంచి ఫొటోగ్రఫీతో సహా గమనిస్తే అర్థమవుతుంది. ఇసుక తరలింపు (Sand Transport) లో తల దూర్చిన, సహకరించిన ప్రతి అధికారి ఆస్తులను కూడా జప్తు చేసేందుకు అవకాశం ఉంది. - దండా నాగేంద్ర, పిటిషనర్
బాపట్ల జిల్లాలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు - ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండాలి. ఏపీలో జరిగిన ఇసుక దోపిడీ (Sand mining) దేశంలోనే అతి పెద్ద కుంభకోణం కానుంది. సుమారు 40వేల నుంచి 50 వేల కోట్ల దోపిడీ జరిగింది. అందుకే ఈ విషయం హైకోర్టు పరిధిని మించిపోయి ఎన్జీటీ కూడా సుప్రీం కోర్టుకు సిఫారసు చేయడం గమనార్హం. అధికారులు ఎలాంటి మైనింగ్ జరగడం లేదంటూ తప్పుడు నివేదికలు ఇవ్వడం సరికాదు. ఇసుక తవ్వకాల బినామీలు ఎవరో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరిపై చర్యలు ఉంటాయి. - లక్ష్మీనారాయణ, న్యాయవాది
బాపట్ల జిల్లాలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు - ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు