ETV Bharat / politics

రేవంత్​ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాహుల్​ గాంధీ ప్రధాని అవ్వలేరు : హరీశ్​రావు

Harish Rao Shocking Comments on Congress : కాంగ్రెస్​ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా విడిచిపెట్టేది లేదని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్న ఒక్కటి మాత్రమే అమలు చేశారని తెలిపారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్​కు లేదని విమర్శించారు. సీఎం రేవంత్​ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాహుల్​ గాంధీ ప్రధాని కారని ఎద్దేవా చేశారు.

Harish Rao on Pension in Telangana
Harish Rao Shocking Comments on Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 5:42 PM IST

Harish Rao Shocking Comments on Congress : కేంద్రంలో బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్​కు లేదని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. సీఎం రేవంత్​ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాహుల్​ గాంధీ(Rahul Gandi) ప్రధాని అవ్వరని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రెండు నెలలో ఒక్కటి మాత్రమే అమలు చేశారని మండిపడ్డారు. భద్రాచలంలోని మహబూబాబాద్​ పార్లమెంట్​ ఎన్నికల(Parliament Election 2024) సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

రైతుబంధు అడిగితే మంత్రి కోమటిరెడ్డి అహంకారంతో ప్రవర్తించారు : హరీశ్‌రావు

Harish Rao Comments on BJP : గత ఎన్నికల్లో ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ లాంటిదని హరీశ్​రావు (Harish Rao)అన్నారు. కార్యకర్తలు ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రయాణంలోనే పూలబాటలు, ముళ్ల మార్గాలున్నాయని తెలిపారు. అబద్దాలతో కాంగ్రెస్ గద్దె నెక్కిందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ ఆరోపిస్తుందని మోదీ మిత్రుడు అయిన అదానీని ఆహ్వానిచ్చింది ఎవరని ప్రశ్నించారు. బీజేపీని ఓడించేది తామేనని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర హక్కులను కేంద్రం చేతిలో పెడితే అడుక్కోవాల్సి వస్తుంది - హరీశ్​రావు

Harish Rao on Pension in Telangana : భారతదేశంలోనే అత్యంత అసభ్యకరంగా భాష మాట్లాడే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని హరీశ్​రావు ఆరోపించారు. గెలిచిన వెంటనే రూ.4000లకు పింఛన్​ ఇస్తానని చెప్పి ఇప్పటివరుకు రూ.2000లు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేకమంది రోగులు, వృద్ధులు పింఛన్ మీద ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా లేకపోవడమేనా మార్పు అని నిలదీశారు. సాగునీటి ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పగించి కీలు బొమ్మల మారడమేనా మార్పు అని ప్రశ్నించారు.

దావోస్​కు వెళ్తే డబ్బులు దండగా అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు వెళ్లారు : హరీశ్​రావు

"బీఆర్ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు భద్రాచలానికి రూ.39 కోట్లు మంజూరు చేశాం. కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే 6 గ్యారంటీలు అమలు అవుతాయని రేవంత్ రెడ్డి చెప్పారు, తాను తలకిందులుగా తపస్సు చేసినా రాహుల్ గాంధీ ప్రధాని అవ్వరు. బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్​కు లేదు. బీజేపీని ఓడించే శక్తి కేవలం ప్రాంతీయ పార్టీలకి ఉంది. రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. పార్లమెంట్​లో తెలంగాణకు అన్యాయం జరిగితే పోరాడేది కేవలం బీఆర్​ఎస్​ ఎంపీలు మాత్రమే."- హరీశ్​రావు, మాజీ మంత్రి

Harish Rao Hot Comments on Rahul Gandi : డిసెంబర్ 9న గెలవగానే రుణమాఫీ(Runamafi) చేస్తాను అని చెప్పి ఇప్పటివరకు చేయలేదని హరీశ్​రావు అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని హితవు పలికారు. తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కూడా ప్రచారం చేసుకోలేకపోయామని విచారం వ్యక్తం చేశారు.

రేవంత్​ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాహుల్​ గాంధీ ప్రధాని అవ్వలేరు హరీశ్​రావు

రోగాలు నయం చేసే వైద్యులు ఎంత గొప్పవారో, పరిసరాల శుభ్రతకు పాటుపడే కార్మికులూ అంతే గొప్ప : హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.