ETV Bharat / politics

కాషాయ పార్టీ మేనిఫెస్టో పేరు గొప్ప - ఊరు దిబ్బలా ఉంది : హరీశ్‌రావు - Harish Rao Reacts on BJP Manifesto - HARISH RAO REACTS ON BJP MANIFESTO

Harish Rao Reacts on BJP Manifesto : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సంకల్ప పత్ర పేరుతో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై మాజీ మంత్రి హరీశ్​రావు స్పందించారు. కాషాయ పార్టీ మేనిఫెస్టో పేరు గొప్ప, ఊరు దిబ్బలా ఉందని, కేవలం ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమైందని ఆయన విమర్శించారు. కమలం పార్టీ మాటల్లోనే వికసిత్‌ భారత్‌, చేతల్లో విభజన భారత్‌ అని ఆరోపించారు. మేనిఫెస్టోలో ఎక్కడ కూడా రైతు రుణమాఫీ అంశం లేదని హరీశ్‌రావు ఆక్షేపించారు.

Lok Sabha Elections 2024
Harish Rao Reacts on BJP Manifesto 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 9:00 PM IST

Harish Rao Reacts on BJP Manifesto : లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో పేరుగొప్ప-ఊరు దిబ్బలాగా ఉందని మాజీమంత్రి హరీశ్​రావు వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలో వాస్తవాలు మరుగున పడేసి, ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమైందని ఆరోపించారు. మాటల్లో వికసిత్ భారత్ - చేతల్లో విభజిత్ భారత్ అని మరోసారి కమలం పార్టీ నిరూపించింది అని పేర్కొన్నారు. మాటల గారడీ తప్ప, చేతల్లో చేసేదేమీ లేదని బీజేపీ మేనిఫెస్టో తేల్చిచెప్పిందని విమర్శించారు.

ప్రభుత్వ వైఫల్యాలు తెలిసేలా పోస్టుకార్డు ఉద్యమం ప్రారంభించాం : మాజీ మంత్రి హరీశ్​రావు - Lok Sabha Elections 2024

మహిళలు, యువకులు, పేదలు, రైతులే తమకు ప్రధానమని చెప్పినా, ఈ నాలుగు వర్గాలను కూడా బీజేపీ విస్మరించిందన్నారు. కమలం మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ ముచ్చటే లేదని, జాతీయ ప్రాజెక్టు(National Project) ఊసులేదని, మధ్య తరగతికి ఆదాయపన్ను రాయితీలు లేవని అన్నారు. కార్మికులు, చేతివృత్తుల వారికి పన్ను మినహాయింపు లేదన్న హరీశ్​రావు, యువతకు ఉద్యోగాల విషయమే లేదని, చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ పెంపు విషయం ప్రస్తావించలేదని ఆక్షేపించారు.

బీజేపీ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ అంశం లేదు : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ గురించి హామీ లేదని, 50 శాతం రిజర్వేషన్ పరిమితి పెంచడంపై ఊసే లేదని దుయ్యబట్టారు. హైదరాబాద్ సహా మెట్రో నగరాల అభివృద్ధిపై స్పందన లేదన్న ఆయన, ఉచిత పథకాలపై బీజేపీ చెప్పిందేమిటి? చేసిందేమిటి? అని మాజీ మంత్రి హరీశ్​రావు ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి రైతుల రుణమాఫీ(Loan Waiver) భారాన్ని కేంద్రం కూడా భరించాలని డిమాండ్లు వచ్చినా కానీ, జాతీయ మేనిఫెస్టోలో రైతుల రుణమాఫీకి సంబంధించి ఒక్కమాట కూడా హామీగా ఇవ్వలేదని ఆందోళన వ్యక్తంచేశారు.

అబద్ధాలు చెప్పడంలో బీజేపీ బడేమియా -కాంగ్రెస్​ చోటేమియా : హరీశ్​రావు - Harish Rao Fires on BJP Congress

ఉచిత పథకాలతో ఊదరకొట్టిన బీజేపీ : కార్పొరేట్ కంపెనీల రుణాలను రూ.12 లక్షల కోట్ల వరకు మాఫీ చేసిన మోదీ సర్కార్, పదేళ్లలో ఒక్క రైతుకు చెందిన ఒక్క రూపాయి కూడా రుణం మాఫీ చేయలేదని, రాబోయే కాలంలో రుణమాఫీ చేసేది లేదని మేనిఫెస్టోలోనే చెప్పిందన్నారు. పదేళ్లలో చేసిందేమీ లేకపోవడంతో ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే ఉచిత పథకాలు(Free Schemes) అమలు చేస్తామని బీజేపీ హామీ ఇస్తుందన్నారు. ఉచితంగా రేషన్, విద్యుత్, వైద్యం, ఇండ్ల పేరుతో ఉచితాల జపం చేశారని ధ్వజమెత్తారు.

Harish Rao Fires on BJP : వివిధ రాష్ట్రాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, వాటిని తప్పుపట్టిన ప్రధాని, తమ మేనిఫెస్టోలో మాత్రం మొత్తం ఉచిత పథకాల హామీలనే ఇచ్చారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం గడిచిన పదేళ్లలో అమలు చేసిన పథకాలన్నీ అందరికీ కాకుండా కొందరికే పరిమితం చేశారని ఆరోపించారు. సుస్థిరత, సమర్థత, భద్రత, సంకల్ప్ లాంటి గంభీరమైన మాటలు జోడించి పేజీలు నింపారు తప్ప, నిజంగా భారతీయ సమాజం ఇవాళ ఏమి కోరుకుంటున్నదో గుర్తించి, దానిపై బీజేపీ పార్టీ విధానం ప్రకటించలేదని అసహనం వ్యక్తంచేశారు. ప్రజలంతా ఈ మేనిఫెస్టోను తిరస్కరించారన్నారు. కమలం పార్టీకి ఓటు వేయవద్దని హరీశ్​రావు కోరారు.

ప్రజలారా మేల్కొండి - వాళ్ల కుట్రలను అర్థం చేసుకోండి : కేటీఆర్​ - Ambedkar Jayanthi Celebrations

లోక్‌సభ ఎన్నికలకు పదునెక్కిన ప్రచారం - ప్రసంగాలతో జోరందుకున్న విపక్ష పార్టీలు - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.