ETV Bharat / politics

సిద్దిపేటలో కాంగ్రెస్​ వర్సెస్​ బీఆర్​ఎస్​ - హరీశ్​రావు రాజీనామా చేయాలని మైనంపల్లి సవాల్​ - Mynampally on Harish Rao Resign - MYNAMPALLY ON HARISH RAO RESIGN

Mynampally on Harish Rao in Siddipet : రుణమాఫీపై సవాల్‌ విసిరిన హరీశ్​రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ నేత మైనంపల్లి హన్మంతరావు డిమాండ్‌ చేశారు. ఇద్దరం కలిసి ఉపఎన్నికలో తలపడదామన్న మైనంపల్లి, ఓడిపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతానని వెల్లడించారు. సిద్దిపేటలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించాయి. ఎమ్మెల్యే హరీశ్​రావు క్యాంపు కార్యాలయంలో రుణమాఫీపై గులాబీ పార్టీ నేతలు సమావేశమయ్యారు. మరోవైపు రాజీవ్‌ గాంధీ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్‌ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి.

Congress VS BRS Disputes in Siddipet
Mynampally on Harish Rao in Siddipet : (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 20, 2024, 7:37 PM IST

Updated : Aug 20, 2024, 7:54 PM IST

Congress VS BRS Disputes in Siddipet : సిద్దిపేటలో కాంగ్రెస్‌, బీఆర్​ఎస్​ పోటాపోటీ కార్యక్రమాలు కాస్త ఆందోళనకు గురిచేశాయి. రుణమాఫీపై ఎమ్మెల్యే హరీశ్​రావు క్యాంపు కార్యాలయంలో గులాబీ పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు. మాఫీ కాని రైతులకు పార్టీ తరపున అండగా ఉండే అంశంపై చర్చించారు. మరోవైపు మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ జయంతిని పురస్కరించుకొని మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ భారీ ర్యాలీ నిర్వహించింది. పొన్నాలలో రాజీవ్‌ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పాతబస్టాండ్‌ వరకు బైక్‌ ర్యాలీ చేపట్టగా బ్లాక్‌ ఆఫీస్‌ వద్ద పోలీసులకు కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నుంచే ర్యాలీకి కాంగ్రెస్‌ శ్రేణులు యత్నించగా ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు సర్ది చెప్పి మరోమార్గంలో పంపించారు. రుణమాఫీపై సవాల్‌ చేసిన హరీశ్​రావు రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఆస్తి అయిన క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఫొటో పెట్టకుండా కేసీఆర్​ చిత్రం ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు.

'కాంగ్రెస్‌ రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చినందుకు హరీశ్​రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. మీరు రాజీనామాకు సిద్ధమా అని అడుగుతున్నా. ఉప ఎన్నికల్లో ఇద్దరం కలసి పోటీ చేద్దాం. మీరు గెలిస్తే ఎన్నికల్లో నేను మళ్లీ పోటీ చేయను. రాబోయే రోజుల్లో కేసీఆర్​ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయం. బీఆర్​ఎస్​ నేతలను హరీశ్​రావు రెచ్చగొట్టారు'- మైనంపల్లి హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యే

రుణమాఫీ సహా ఆరు గ్యారంటీలు అమలు చేస్తేనే రాజీనామా : హరీశ్​రావును రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని బీఆర్​ఎస్​ నాయకులు విమర్శించారు. రుణమాఫీ డొల్లతనాన్ని ప్రజలకు వివరించేందుకే సిద్దిపేటలో సమావేశం నిర్వహించామన్న నేతలు, రుణమాఫీ సహా ఆరు గ్యారంటీలు అమలు చేస్తేనే రాజీనామా చేస్తానని హరీశ్​రావు చెప్పినట్లు గుర్తుచేశారు. ఇటీవలే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద దాడి నేపథ్యంలో ఇరు పార్టీలు పోటాపోటీ కార్యక్రమాల నిర్వహణపై పోలీసులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. ఉద్రిక్తతలు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు.

'మహారాజ ఈ దేవత వస్త్రాలతో సభలోనే ఉంటే సరిపోదు. మీరు పురవీధుల్లో కూడా ఊరేగాలని అంటాడు ఒకరు. సరే అని చెప్పి, మహారాజును ఏనుగు మీద కూర్చోబెట్టి ఊళ్లో తిప్పడం మొదలు పెడతారు. పౌరులు పట్టించుకోలేదు. ఇదే తరహాలో రేవంత్​రెడ్డి రుణమాఫీ కూడా ఉంది'- దేశపతి శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ

సిద్దిపేటలో టెన్షన్​ టెన్షన్ - ఉద్రిక్తతతకు దారితీసిన బీఆర్ఎస్ ధర్నా - High Tension In Siddipet

హరీశ్​రావు రాజీనామా చేయాలంటూ పోస్టర్లు - సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా - Harish Resign Posters in Siddipet

Last Updated : Aug 20, 2024, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.