KTR On DSC Jobs in Telangana : ప్రజాపాలనలో నిరుద్యోగుల కలలు కల్లలయ్యాయని కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. 60 వేల మందికి నియామకపత్రాలను అందించామని, అది కాంగ్రెస్ ఘనత అంటూ సీఎం ప్రకటించటాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. ఈరోజు నియామపకపత్రాలు అందుకోనున్న ఉపాధ్యాయులు మొదలు ఇటీవల జరిగిన అన్ని నియామకాలు కలిపితే 40వేలు దాటలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్‌కు సంబంధించిన ప్రక్రియ కూడా పది నెలల్లో పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. 25,000 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించిన సర్కారు, కేవలం 11,066 నియామకాలకు తగ్గించిందని ఎత్తి చూపారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌కు 6,000 పోస్టులు జోడించి ఈ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 30,000 వేల నియామక పత్రాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లు, పరీక్షలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లు బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనే పూర్తి చేశామన్నారు. కేవలం అపాయింట్‌మెంట్ ఆర్డర్లు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలను గాలికి వదిలేసినట్లే ప్రభుత్వం నిరుద్యోగులనూ మోసం చేసిందని ఘాటుగా వ్యాఖ్యానించిన కేటీఆర్, ఎన్నికల హామీ ప్రకారం ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ ముఖ్యమంత్రిని చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడని అనిపిస్తున్నది..!
— KTR (@KTRBRS) October 9, 2024
నియామకాలపై మరీ ఇంత నీతిమాలిన ప్రచారమా..?
ప్రజా ధనాన్ని తగలేసి...ఫ్రంట్ పేజీల్లో పచ్చి అబద్ధాలతో ప్రకటనలా..?
గత ప్రభుత్వ ఉద్యోగాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలి కదా..!
తెలంగాణ యువత ను…
యువతను పిచ్చోళ్లను చేస్తున్నారా? : ఈ ముఖ్యమంత్రిని చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడని అనిపిస్తుందని కేటీఆర్ ఆక్షేపించారు. ఉద్యోగ నియామకాలపై మరీ ఇంత నీతిమాలిన ప్రచారమా? అంటూ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ప్రజా ధనాన్ని తగలేసి ఫ్రంట్ పేజీల్లో పచ్చి అబద్ధాలతో ప్రకటనలా? అని సూటిగా ప్రశ్నించారు. గత ప్రభుత్వ ఉద్యోగాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలి కదా! అని ఎద్దేవా చేశారు. తెలంగాణ యువతను పిచ్చోళ్లను చేస్తున్నారా? అశోక్ నగర్ చౌరస్తాకు ఉస్మానియా క్యాంపస్‌కు పోయి చెప్తారా కొలువుల పండుగ కథలు? ఏంటని విమర్శించారు. ఏడాదిలో రెండు లక్షల కొలువులు గ్యారెంటీ అని, నిరుద్యోగుల చెవుల్లో పువ్వులు పెట్టింది చాలక తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టించడం దుర్మార్గం అని ఆరోపించారు.
Rahul Ji,
— KTR (@KTRBRS) October 9, 2024
Youth in Ashok Nagar are waiting to thank you for delivering on “2 lakh Jobs in 1 year”
Also thank you for the 5 lakh “Yuva Vikasam” assistance & revamp of TSPSC
Welcome back to Hyderabad to meet with the youngsters since your guarantee is done https://t.co/LJbagV2Kka
రాహుల్ జీ అశోక్ నగర్‌లో యువత ఎదురుచూస్తున్నారు : అశోక్ నగర్‌లోని యువత ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అందించినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు ఎదురుచూస్తున్నారని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన రాహుల్ జీ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ విమర్శలు చేశారు. అలాగే టీజీపీఎస్సీ 5 లక్షల యువ వికాసం సహాయం, పునరుద్ధరణకు ధన్యవాదాలు తెలిపారు. మీరు( రాహుల్ గాంధీ)ఇచ్చిన హామీ పూర్తయినందున యువకులను కలవడానికి తిరిగి హైదరాబాద్‌కు స్వాగతం అంటూ విమర్శనాత్మకంగా పోస్టు చేశారు.
KTR on BC Students Education in Foreign : బీసీ బిడ్డలకు విదేశీ విద్య అందని ద్రాక్షేనా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నాడు కేసీఆర్‌తో సాధ్యమని, నేడు అసాధ్యమని పేర్కొన్నారు. పేద విద్యార్థులతో సర్కార్ చెలగాటం అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జ్యోతిబా పులే విదేశీ విద్య పథకానికి కాంగ్రెస్ తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. ముగుస్తున్న కోర్సులు, అప్పుల్లో తల్లిదండ్రులు, సాగదిస్తున్న అధికారులు అంటూ విమర్శించారు. దరఖాస్తు చేసుకుని ఏడాది అవుతున్నా ఎందుకు ఇంత నిర్లక్ష్యమని నిలదీశారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్ తక్షణం జాబితా ప్రకటించి ఉపకార వేతనం రిలీజ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.
బిసి బిడ్డలకు విదేశి విద్య అందని ద్రాక్షేనా? నాడు KCRతో సాధ్యం నేడు అసాధ్యం-పేద విద్యార్థులతో సర్కార్ చెలగాటం
— KTR (@KTRBRS) October 9, 2024
జ్యోతిబా పులే విదేశి విద్య పథకానికి కాంగ్రెస్ తూట్లు పొడుస్తుంది
ముగుస్తున్న కోర్సులు-అప్పుల్లో తల్లిదండ్రులు-సాగదిస్తున్న అధికారులు
దరఖాస్తు చేసుకుని ఏడాది అవుతున్నా… pic.twitter.com/Kc1mO09Lc2