ETV Bharat / politics

సీఎం పీఠంపై మరో 30ఏళ్లు- రుషికొండపై కలల​ ​రాజప్రాసాదం కథ అదే! - Rushikonda Palace

Rushikonda Palace : బెంగళూరు, హైదరాబాద్, ఇడుపుల పాయ, తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసాలను చూస్తే సామాన్యులే కాదు సంపన్నులు సైతం ఆశ్చర్యపోవాల్సిందే. ఇక రుషికొండపై నిర్మించిన నివాసం బకింగ్​హామ్ ప్యాలెస్​ను తలపిస్తోందని జాతీయ మీడియా విశ్లేషించింది. ​ప్రజాధనం మంచినీళ్లలా ఖర్చు చేస్తూ విలాసవంతమైన భవనం నిర్మించడమేంటని నిలదీసింది.

rushikonda_palace_photos
rushikonda_palace_photos (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 19, 2024, 1:33 PM IST

rushikonda_palace_photos
rushikonda_palace_photos (ETV Bharat)

Rushikonda Palace : "ఒక్క అవకాశం" అంటూ అధికారంలోకి వచ్చిన జగన్​.. తాను మరో 30ఏళ్లపాటు సీఎం పదవిలో ఉంటానని కలలుగన్నాడు. అధికారం శాశ్వతం కాదని తెలిసీ.. ప్రజలను యాచకులుగా మార్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే మెజార్టీ ప్రజలను ఆకర్శించే పథకాల వల విసిరాడు. అనతి కాలంలోనే జగన్​ మోసాన్ని పసిగట్టిన జనం.. సమయం కోసం వేచి చూసి ఓటు అనే ఆయుధంతో జగన్​ అహంకారాన్ని అంతం చేశారు.

rushikonda_palace_photos
rushikonda_palace_photos (ETV Bharat)
rushikonda_palace_photos
rushikonda_palace_photos (ETV Bharat)

ఏడు భవనాలు, మూడు ఇళ్లు, 12 పడక గదులు- 'నిరుపేద జగన్ నివాసానికి అనుకూలమట' - Jagan Rushikonda Palace

రిషికొండపై ప్రభుత్వ భవనాలే నిర్మించామంటూ వైఎస్సార్సీపీ నాయకులు మూలాలు మరిచి మాట్లాడుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి బాత్రూంలు నిర్మించడం, అత్యంత విలువైన విదేశీ ఫర్నిచర్​ వినియోగించడం ఎంత వరకు సమంజసమని మీడియా ప్రశ్నిస్తోంది. ప్రజా ధనానికి రక్షకుడిగా ఉండాల్సిన వ్యక్తి ఎథిక్స్, మోరల్స్ విస్మరించారని దుమ్మెత్తిపోస్తోంది.

rushikonda_palace_photos
rushikonda_palace_photos (ETV Bharat)

ఒక్కో బాత్​టబ్​ ఖర్చు రూ.36లక్షలు కాగా, ల్యాండ్ స్కేప్ వ్యయం రూ.50 కోట్లు, రూ.30కోట్లు లైటింగ్, రూ.80 కోట్లు ఇంటీరియర్ డిజైన్, రూ.100 కోట్లు డ్రైనేజీ సిస్టమ్ కోసం ఖర్చు చేసినట్లు సమాచారం. మంచాలు, కుర్చీలు, పరుపులు, బల్లలన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. ప్యాలెస్​లో ముఖం చూసుకునే అద్దం మొదలుకొని స్నానాల తొట్టి, కమోడ్లు, విండో, డోర్​ కర్టెన్ల వరకు అన్నీ వివిధ దేశాల నుంచి తెప్పించినవే.

rushikonda_palace_photos
rushikonda_palace_photos (ETV Bharat)

చివరకు మరుగుదొడ్లలో వినియోగించిన వాల్‌షీట్లు కూడా విదేశాలవే కావడం విశేషం. మొత్తం ఐదు దేశాల గ్రానైట్, మార్బుల్స్‌తో తీర్చిదిద్దారు. రూ.60 వేల విలవైన విద్యుత్​ దీపాలను వందల సంఖ్యలో ఏర్పాటు చేయడంపై ఐశ్వర్యవంతులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రజాధనంతో ఇంత జల్సానా? అని ముక్కున వేలేసుకుంటున్నారు.

rushikonda_palace_photos
rushikonda_palace_photos (ETV Bharat)

రుషికొండ రాజకోట రహస్యమిదే- అత్యంత విలాసవంతమైన నిర్మాణాలు - Rushikonda Buildings Secrets

rushikonda_palace_photos
rushikonda_palace_photos (ETV Bharat)

విజయనగర బ్లాక్‌ పేరుతో సీఎం కుటుంబ అవసరాలకు రుషికొండపై మూడు భవనాలు నిర్మించారు. ఈ మూడు భవనాలను గొప్పగా తీర్చిదిద్దారు. సీఎం నివాసంలోని పడక గది డెకరేషన్​ కోసం చేసిన ఖర్చు చూస్తే అవాక్కవ్వాల్సిందే. లేత బంగారువర్ణంతో ఆ గది మెరిసేలా షాండ్లియర్లను అమర్చారు. యూరప్‌ నుంచి ప్రత్యేకంగా గ్రానైట్‌ను తెప్పించి ఫ్లోర్​ను తీర్చిదిద్దారు.

rushikonda_palace_photos
rushikonda_palace_photos (ETV Bharat)

అందులో వినియోగించిన మంచం, పరుపు, కుర్చీలు, బల్లలు విదేశాలనుంచి తెప్పించినవే. ఇదే గదిలో బయోమెట్రిక్‌తో ఆపరేట్​ చేసే వార్డ్‌రోబ్స్‌ను ఏర్పాటు చేశారు. విలాసవంతమైన స్పా, మరుగుదొడ్లు ఉండగా అత్యంత సంపన్నులు మాత్రమే కొనగోలు చేయగలిగిన జపాన్‌ దేశానికి చెందిన కమోడ్‌ బిగించారు. ఒక్క కమోడ్​ విలువ రూ.15 లక్షల వరకు ఉంటుందని అంచనా.

rushikonda_palace_photos
rushikonda_palace_photos (ETV Bharat)

వియత్నాం, స్పెయిన్, ఇటలీ, నార్వే, బ్రెజిల్‌కు చెందిన మెటీరియల్‌ వినియోగించగా.. వాటిని అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం, అత్యద్భుతంగా నగిషీలు తీర్చిదిద్దడం వెనుక ఖర్చు సామాన్యుల ఊహకు కూడా అందదు.

rushikonda_palace_photos
rushikonda_palace_photos (ETV Bharat)

'ఎవరి కోసం ఈ విలాస భవనాలు?'- రుషికొండ రాజమహల్​ను పరిశీలించిన కూటమి నేతలు - MLA GANTA ON RUSHIKONDA Buildings

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.