Ex Minister Niranjan Reddy on Kodangal Lift Irrigation : కాంగ్రెస్ సర్కార్ బేషజాలకు పోయి ప్రజాధనం దుర్వినియోగం చేయకూడదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి సూచించారు. జూరాలలో(Jurala Project) ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు నీళ్లు సరిపోవట్లేదని, తాజాగా కొడంగల్ ఎత్తిపోతలతో నీటి పంచాయతీ పెట్టొద్దని విమర్శించారు. 365 రోజులు నీటి లభ్యత ఉండేలా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పాలమూరు ఎత్తిపోతలకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన, రేవంత్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేంద్రంలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితే లేదు : హరీశ్‌రావు
కర్ణాటక తుంగభద్ర, కృష్ణా నదులపై ఇష్టారీతిన ప్రాజెక్టులు కడుతూ రాష్ట్రానికి నీళ్లు రాకుండా చేస్తుందని దమ్ముంటే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి ప్రాజెక్టులను ఆపించాలని డిమాండ్ చేశారు. కర్ణాటకను నిలువరించకపోతే కాంగ్రెస్(Congress Govt) వైఫల్యం అవుతుందని, ప్రజలు గుణపాఠం చెబుతారని చెప్పారు. పొత్తుల గురించి పార్టీ అధినేతలు చూసుకుంటారన్న నిరంజన్ రెడ్డి, దేశంలో పొత్తులు కావాలని ప్రాంతీయ పార్టీల దగ్గరకు వస్తున్నది రెండు జాతీయ పార్టీలే కదా అని ప్రశ్నించారు. పొత్తుల కోసం తాము అర్రులు చాచడం లేదని వ్యాఖ్యానించారు.
BRS Leader Niranjan Reddy Fires on Congress : పాలమూరు-రంగారెడ్డిలో ఏడు నుంచి పది శాతం పనులు మిగిలి ఉన్నాయన్న ఆయన, కరివెన, ఉద్దండాపూర్ నుంచి కేవలం కాలువలు తవ్వితే నారాయణపేట - కొడంగల్‌కు గ్రావిటీతో(Gravity) నీరు పోతుందని తెలిపారు. తాము మంజూరు చేసిన కాలువ పనులు రద్దు చేసి నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల చేపడుతున్నారని, జూరాలపై ఇప్పటికే ఒత్తిడి ఉంటే మళ్లీ అక్కడి నుంచే చేపడుతున్నారని ఆక్షేపించారు.
"జూరాల ప్రాజెక్టులో ఉన్న సామర్థ్యం ఇప్పుడున్న 5.7 లక్షల ఎకరాలకే సరిపోక, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పరిధి రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. దానిమీద అదనపు భారమా అని కొడంగల్-నారాయణ్‌పేట ఎత్తిపోతల ప్రాజెక్టును జూరాలపై పెట్టడం మూలంగా, దానికి ఫలితం మాట పక్కన పెడితే ఉన్న ప్రాజెక్టులకు ఇబ్బంది కలుగుతుంది."-సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి
ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు ఖ్యాతి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అనవసర భేషజాలకు పోవద్దన్న నిరంజన్ రెడ్డి, జూరాల ఒత్తిడి తట్టుకోలేదని పేర్కొన్నారు. కొత్తగా నీటి పంచాయతీలు(Water Panchayats) వచ్చే అవకాశం లేదా అని ప్రశ్నించారు. కాలువ పనులు పూర్తి చేస్తే లక్షన్నర ఎకరాలకు నీరు వస్తుందన్న మాజీ మంత్రి, పాలమూరు - రంగారెడ్డి పనులను పక్కన పెట్టి పది లక్షల ఎకరాలకు నీరు రాకుండా చూస్తారేమోనని ఆందోళన నెలకొందని వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రాజెక్టుకు తమని తీసుకెళ్తే పూర్తి చేసిన అన్ని పనులు చూపిస్తామన్న ఆయన, కరివెన, ఉద్దండాపూర్ నుంచి కాలువలు త్వరగా పూర్తి చేసి నారాయణపేట - కొడంగల్ ప్రాంతానికి నీరు తీసుకెళ్లాలని సూచించారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చేవరకు మా పోరాటం కొనసాగుతుంది : నిరంజన్ రెడ్డి
కృష్ణా జలాలపై చిత్తశుద్ధి చూపించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడండి : నిరంజన్ రెడ్డి