MLA attack victim : అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం చిన్నతనం నుంచి తన అలవాటు అని, ఆ వైఖరి వల్లే తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివశంకర్ ను నిలదీసినట్లు గొట్టిముక్కల సుధాకర్ తెలిపారు. నిన్న తెనాలిలోని ఐతా నగర్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే, అతని అనుచరుల దాడిలో గాయపడిన సుధాకర్ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శివకుమార్, అతని కుటుంబసభ్యులు క్యూలైన్లో కాకుండా నేరుగా వెళ్లి ఓటు వేయడం వల్ల అప్పటికే మూడు, నాలుగు గంటల పాటు ఎండలో ఉన్న వృద్ధులు, మహిళలు ఇబ్బంది పడ్డారని, అందుకే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే ఎమ్మెల్యేతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో గొట్టిముక్కల సుధాకర్ స్పందన ఇది. నిన్న జరిగిన దాడికి సంబంధించిన వివరాలను ఆయన మాటల్లోనే విందాం.
ఓటరును కొట్టిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యేను తిరిగి కొట్టిన ఓటర్ - MLA Beat Voter
పోలింగ్ స్టేషన్లో ఓటరుపై జరిగిన దాడిపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఎమ్మెల్యే శివకుమార్‌కు గృహ నిర్బంధం విధించింది. పోలింగ్ పూర్తయ్యే వరకు బయటకు రావొద్దని హెచ్చరించడంతో పాటు కేసు నమోదు చేసింది.
వైఎస్సార్సీపీకి షాక్ - తిరగబడ్డ ఓటర్లు - తోకముడిచిన లీడర్లు - AP ELECTIONS 2024 POLLING
పోలింగ్ కేంద్రంలో ఓటరుపై దాడి చేసిన ఘటనలో గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదుతో ఐపీసీ 341, 323 సెక్షన్ల కింద తెనాలి రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే శివకుమార్ పోలింగ్ సందర్భంగా కుటుంబసభ్యులు, అనుచరులతో కలిసి ఐతానగర్ కేంద్రానికి చేరుకున్నారు. కాగా, అప్పటికే తామంతా గంటలకొద్దీ క్యూలో వేచిచూస్తున్నామని, మందీమార్భలంతో నేరుగా ఎలా వెళ్తారని ఓటు కోసం వరుసలో ఉన్న గొట్టిముక్కల సుధాకర్ ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన శివకుమార్ సుధాకర్ చెంపపై కొట్టగా అంతే వేగంగా సుధాకర్ సైతం ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటనతో చెలరేగిపోయిన ఎమ్మెల్యే అనుచరులు సుధాకర్‌పై విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా పిడిగుద్దులతో దాడికి తెగబడ్డారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన సుధాకర్ ప్రస్తుతం గుంటూరు జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఓటరుపై దాడి ఘటన - తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై కేసు - police booked Case on Tenali MLA