ETV Bharat / politics

కాంగ్రెస్​లో చేరుతున్నారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఈటల​ - Etela Rajender Viral Pic

Eetala Rajendar Clarity on Join Congress : తాను కాంగ్రెస్​ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని బీజేపీ సీనియర్​ నేత ఈటల రాజేందర్​ స్పష్టత ఇచ్చారు. బీజేపీ కార్పొరేటర్​ కొప్పుల నరసింహా రెడ్డి గృహ ప్రవేశంలో హస్తం పార్టీ నాయకులను కలిశానని వివరణ ఇచ్చారు. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని సూచించారు.

Etela Clarity on Join Congress
Eetala Rajendar Clarity on Join Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 7:36 PM IST

Eetala Rajendar Clarity on Join Congress : తాను కాంగ్రెస్​లో చేరనున్నారని సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్న వార్తలపై బీజేపీ సీనియర్​ నేత ఈటల రాజేందర్(Etela Rajender)​ స్పష్టత ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నారనే వార్తలో నిజం లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లోకి చేరిన మైనంపల్లి హన్మంతరావు, మాజీ మంత్రి పట్నం మహేందర్​ రెడ్డితో కలిసి దిగిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అమలుకు సాధ్యం కాని హామీలతో ప్రజలను కాంగ్రెస్‌ మభ్యపెడుతుంది : ఈటల రాజేందర్​

Etela Rajender Meet Congress Leaders Picture : కాంగ్రెస్​ నాయకులతో దిగిన ఫొటోను చూసి ఈటల రాజేందర్​ కాంగ్రెస్​లో చేరుతారని రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలకు దారితీసింది. ఆ వార్త కాస్త ఆయనకు తెలిసింది. దీంతో ఆయన ఈ విషయంపై స్పందించారు. పార్టీ మారతారనే వస్తున్న వార్తలను ఖండించారు. బీజేపీ కార్పొరేటర్​ కొప్పుల నరసింహా రెడ్డి గృహ ప్రవేశంలో పాల్గొన్నప్పుడు అక్కడికి వచ్చిన వారితో మాట్లాడిన ఫొటోలను వైరల్ చేస్తున్నారని వివరణ ఇచ్చారు.

Etela Rajender Reaction on Congress Join :తాను గృహప్రవేశానికి వచ్చిన హస్తం పార్టీ నేతలతో భేటీ అయ్యారని, అందరితో కలిసి భోజనం చేశానని ఈటల స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్​ సమావేశం(BJP National Council Meeting)లో ఉన్నానని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న అసత్యపు ప్రచారాలను నమ్మవద్దని కార్యకర్తలకు, అభిమానులకు సూచించారు. ఈ ఫొటోలపై దుష్ప్రచారం సరికాదని హెచ్చరించారు.

ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల మద్దతు పొందాం : ఈటల రాజేందర్​

Etela Rajender Viral News : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్​ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. హుజూరాబాద్​లో బీఆర్ఎస్​ అభ్యర్థి పాడి కౌశిక్​ రెడ్డి, అలానే గజ్వేల్​లో మాజీ సీఎం కేసీఆర్​లపై ఓడిపోయారు. అయితే ఓటమి పాలయిన ప్రజల మద్దతు లభించిందని హర్షం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో బీజేపీ(BJP) తరుఫున పోటీ చేసేందుకు ఈటల రాజేందర్​ ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది.

అధిష్ఠానం ఆదేశిస్తే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తా : ఈటల రాజేందర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.