ETV Bharat / politics

ఈరోజే నగదు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? - సమాధానం ఇవ్వాలని ప్రభుత్వానికి ఈసీ లేఖ - Ec letter To Jagan Govt on schemes - EC LETTER TO JAGAN GOVT ON SCHEMES

EC letter to AP Govt on DBT Schemes : పథకాల నగదు బదిలీ ఇప్పటి వరకు ఎందుకు చేయలేపోయారని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించింది. ఇవాళే నగదు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించింది. పోలింగ్‌ తేదీకి ముందు నగదు బదిలీ ఎందుకు చేయాలనుకుంటున్నారో చెప్పాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఈసీ మరో లేఖ రాసింది.

EC letter to AP Govt on DBT Schemes
EC letter to AP Govt on DBT Schemes
author img

By ETV Bharat Telangana Team

Published : May 10, 2024, 2:40 PM IST

EC letter to AP Govt on DBT Schemes : నగదు బదిలీ పథకాలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఇవాళే నగదు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించింది. జనవరి 24 నుంచి మార్చి 24 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తమ ముందు ఉంచాలని ఆదేశించింది. ఒకరోజే నిధుల బదిలీ అవసరం ఎందుకొచ్చిందో తెలుసుకోవడానికేనని వ్యాఖ్యానించింది.

ఇప్పటివరకు నగదు బదిలీ ఎందుకు చేయలేకపోయారో పోలింగ్‌ తేదీకి ముందు ఎందుకు ఇవ్వాలనుకుంటారో వివరించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరణ ఇవ్వాలని ఈసీ తేల్చిచెప్పింది. ఈ ఐదేళ్లలో బటన్‌ నొక్కిన సమయానికి నిధుల బదిలీకి మధ్య వ్యవధిని కోరింది. 'బటన్‌ నొక్కి చాలా వారాలైంది, ఇవాళే నిధులు జమ చేయకపోతే ఏమవుతుంది' అని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ప్రశ్నించింది.

విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ అనుమతి కోరిన సీఎం జగన్ - YS Jagan court permission on Abroad

నిధుల జమకు ఏప్రిల్‌, మే నెలలో కోడ్‌ ఇబ్బంది ఉంటుందని ముందే తెలుసు కదా అని సీఈసీ పేర్కొంది. వారాలపాటు ఆపి పోలింగ్‌ ముందురోజే జమ చేయకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది. ఇవాళే జమ చేయాలన్న తేదీ ముందే నిర్ణయమైందా, ఉంటే వాటి పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. మధ్యాహ్నం 3 గంటలలోపు సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించిన ఈసీ నిధుల జమపై హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలివ్వలేదని లేఖలో పేర్కొంది.

జగన్‌ కోసం దేనికైనా 'సిద్ధం' - కుట్రల అమల్లో వెనక్కి తగ్గని సీఎస్‌ జవహర్‌రెడ్డి - CS Jawahar Reddy Support To Jagan

99 శాతం హామీలు ఎలా పూర్తయ్యాయి జగన్? - ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటి? - YSRCP MANIFESTO 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.