ETV Bharat / politics

కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు- మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్‌ - EC Warning Minister Konda Surekha - EC WARNING MINISTER KONDA SUREKHA

EC Warning to Minister Konda Surekha : దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఈసీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 1వ తేదీన బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై చేసిన విమర్శల విషయంలో వార్నింగ్‌ ఇచ్చింది. స్టార్ క్యాంపెయినర్, మంత్రిగా మరింత బాధ్యతగా ఉండాలని సూచించింది. ఎన్నికల వేళ జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించింది.

Konda Surekha comments on KTR
EC Warning to Minister Konda Surekha
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 26, 2024, 7:50 PM IST

EC Warning to Minister Konda Surekha comments on KTR : బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. కొండా సురేఖ ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు జాగ్రత్తగా మాట్లాడాలని కొండా సురేఖను హెచ్చరించింది. ఇతర పార్టీలను, నేతలు విమర్శించేటప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రిగా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈసీ స్పష్టం చేసింది.

Konda Surekha comments on KTR : ఈనెల 1న వరంగల్‌లో మీడియా సమావేశంలో కేటీఆర్ ​ఫోన్‍ ట్యాపింగ్‍లతో ఎంతోమంది హీరోయిన్లను బ్లాక్‍ మెయిల్‍ చేశాడని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఎంతో మంది అధికారులను బలిచేసి వారు ఉద్యోగాలు కోల్పోయి జైలుకు వెళ్లేలా చేశారని అన్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని అందువల్లే కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి బయటకు వచ్చాడే తప్పా, రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్న ఏనాడు బయటకు రాలేదని ఆమె విమర్శించారు. అధికారం లేకనే కేసీఆర్‌, కేటీఆర్‌ కొత్త డ్రామాలకు తెర తీశారని పేర్కొన్నారు. ఇప్పటికే మీ సోదరి శ్రీకృష్ణ జన్మస్థానం వెళ్లారన్న ఆమె వ్యాఖ్యలు చేసింది.

భయపడితే రాజకీయం చేయలేము - మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు - minister konda surekha fires on ktr

మంత్రి కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌పై చేసిన ఆరోపణలపై ఆ పార్టీ నేతలు కర్నె ప్రభాకర్, దాసోజు శ్రవణ్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వారా నివేదిక తెప్పించుకుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను జిల్లా ఎన్నికల అధికారి ఆంగ్లంలోకి అనువదించి పంపించారు.

EC Suggestions to Minister Konda Surekha : కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను పరిశీలించిన ఈసీ ఆమెకు హెచ్చరికలు జారీ చేసింది. జైలుకు వెళ్లడం ఖాయమన్న భయంతోనే కేటీఆర్ మాట్లాడుతున్నారన్న మంత్రి వ్యాఖ్యలను కూడా ఈసీ పేర్కొంది. ఇలాంటి నిరాధార ఆరోపణలు ప్రతిపక్ష పార్టీ, నేత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎన్నికల ప్రక్రియకు అంతరాయంగా ఉన్నాయని ఈసీ వెల్లడించింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని ఇక ముందు జాగ్రత్తగా ఉండాలని మంత్రిని ఈసీ హెచ్చరించింది.

మతతత్వ పార్టీలోకి పోవాల్సిన అవసరం సీఎం రేవంత్ రెడ్డికి లేదు : కొండా సురేఖ - Konda Surekha on BJP BRS

స్మగ్లర్లపై కఠిన చర్యల కోసం పీడీ యాక్ట్ పెట్టాలి : కొండా సురేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.