ETV Bharat / politics

సాగు నీరు, విద్యుత్​పై లేనిపోని అబద్ధాలు - ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే వచ్చా : భట్టి విక్రమార్క - bhatti vikramarka meet the press - BHATTI VIKRAMARKA MEET THE PRESS

Deputy CM Bhatti Vikramarka on Economic Situation of Telangana : కాంగ్రెస్​ వస్తే పాలన చేయలేదని అనేక మంది విమర్శించారని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. సాగు నీరు, విద్యుత్​పై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. హైదరాబాద్​లోని బషీర్​బాగ్​లో ఉన్న సురవరం ప్రతాప్​రెడ్డి ఆడిటోరియంలో జరిగిన మీట్​ ది ప్రెస్​లో ఆయన పాల్గొన్నారు.

Bhatti Vikramarka
Bhatti Vikramarka
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 12:26 PM IST

Updated : Apr 19, 2024, 7:38 PM IST

సాగు నీరు, విద్యుత్​పై లేనిపోని అబద్ధాలు ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే వచ్చా భట్టి విక్రమార్క

Deputy CM Bhatti Vikramarka on Economic Situation of Telangana : ప్రజాప్రయోజనాలే అంతిమ లక్ష్యంగా తాము పరిపాలన కొనసాగిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్​ వస్తే పరిపాలన చేయలేదని అనేక మంది విమర్శించారన్నారు. తాము వచ్చిన వెంటనే కొన్ని శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశామని తెలిపారు. సాగు నీరు, విద్యుత్​పై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. హైదరాబాద్​లోని బషీర్​బాగ్​లో ఉన్న సురవరం ప్రతాప్​రెడ్డి ఆడిటోరియంలో జరిగిన మీట్​ ది ప్రెస్​లో డిప్యూటీ సీఎం మాట్లాడారు. ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు నమ్మే ప్రమాదం కూడా ఉందని వివరించారు. ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రచారం మంచిది కాదని హెచ్చరించారు. ప్రతిపక్షాల దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగానికి నష్టం జరుగుతుందని అన్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఇక్కడకు వచ్చానని తెలియజేశారు.

బీఆర్​ఎస్​ ఖాళీ అవుతుందనే భయంతోనే కేసీఆర్ బయటికొచ్చారు : భట్టి విక్రమార్క

Deputy CM Bhatti Comments on Rythu Bandhu : రైతు బంధు ఇవ్వలేదని బీఆర్​ఎస్​ నేతలు ప్రచారం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. రైతుబంధు కోసం రూ.7 వేల కోట్లు ఉంచామని ప్రచారం చేస్తున్నారన్నారు. తాము ప్రమాణస్వీకారం చేసిన రోజు ఖజానాలో ఉన్నది మైనస్​ రూ.3960 కోట్లు అని స్పష్టం చేశారు. ఉద్యోగుల జీతాలు, ఉచిత బస్సు ప్రయాణాలకు నిధులు సమకూర్చాలని ఈ సందర్భంగా వివరించారు. గృహలక్ష్మి కింద ఆర్టీసీకి ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీకి ఇప్పటివరకు రూ.1,120 కోట్లు విడుదల చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు.

"విద్యుత్​ సబ్సిడీ కింద రూ.3,924 కోట్లు విడుదల చేశాం. ప్రజలకు ఒక్కటే చెబుతున్నాం. ఎక్కడా పవర్​ కట్​ లేదు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్​ సరఫరా చేస్తున్నాం. నిర్వహణలో భాగంగా ఎక్కడైనా కాసేపు కరెంట్ కోతలు ఉండవచ్చు. అలాంటి కరెంట్​ కోతలను పవర్​ కట్​గా భావించకూడదు. మేం వచ్చాక రైతుబీమా నిధులు రూ.734 కోట్లు చెల్లించాం. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నాం. డ్వాక్రా మహిళలకు ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు ఇస్తాం. మహిళల చేతిలో డబ్బు ఉంటే, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది." - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి

రూ.10లోపే విద్యుత్​ కొంటున్నాం : పదేళ్లుగా బీఆర్​ఎస్​ ప్రభుత్వం విద్యుత్​ విధానం గురించి ఆలోచించలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. నేడు తాము పవర్​ ఎక్స్ఛేంజ్​లో రూ.10లోపే విద్యుత్​ కొంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో గ్రీన్​ పవర్​ను తక్కువ ధరకు కొంటామని వెల్లడించారు. రాష్ట్రానికి మేలు చేయాలనే ఆకాంక్షతో సీఎం రేవంత్​ పని చేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి కొత్త విద్యుత్​ విధానం అవసరం ఉందని తెలిపారు. మంత్రులను, ఇతర నేతలను ప్రజలు కలిసే ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు భట్టి విక్రమార్క ఆదేశాలు ఇచ్చారు. జాబ్ క్యాలెండర్‌ ఇచ్చి తాము ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్న ఆయన ప్రజలపై అదనపు పన్నులు వేయకుండా ప్రత్యామ్నాయ ఆదాయం వనరులను పెంచుకునే దిశలో చర్యలు ఉంటాయన్నారు. ఇప్పటికే ఇందుకోసం కమిటీ వేశామని వెల్లడించారు.

Bhatti Vikramarka Comments : తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు ఇచ్చినట్లు బీజేపీ నాయకులు చెప్పడాన్ని భట్టి కొట్టిపారేశారు. కేంద్రం ఇచ్చిన ఆ నిధులన్నీఏమయ్యాయో తెలియలేదన్నారు. ఏడు లక్షల కోట్లు తెచ్చిన అప్పులు ఏమి చేశారని ప్రశ్నించారు. తాగునీటి సమస్యలు రాకుండా ప్రతిచోటా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. జూన్‌లో రుతుపవనాలు వచ్చి బాగా వర్షాలు కురుస్తాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.43వేల కోట్లతో కట్టిన మిషన్ భగీరథ ప్రయోజనాలు కనిపించలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్​ నేతలు అనేక తప్పులు చేసి అవన్నీతమపై నెడుతున్నారని ఆరోపించారు. సమస్యల పేరుతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్‌ విద్యుత్‌ వ్యవస్థను అల్లకల్లోలం చేసి - ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నారు : భట్టి

పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతలా దిగజారుతారా? : భట్టి విక్రమార్క

Last Updated : Apr 19, 2024, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.