Deputy CM Pawan Kalyan Inspects Saraswati Power Lands: మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ భూములను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలించనున్నారు. పల్నాడు జిల్లా మాచవరం, దాచేపల్లి మండలాల్లో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ పేరిట భూములు ఉన్నాయి. ఆ భూముల్లో అటవీ భూములు, ప్రభుత్వ భూములు, నీటి వనరులు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను పవన్ కల్యాణ్ ఇప్పటికే ఆదేశించారు. వారం రోజుల క్రితం సరస్వతి భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అటవీ, రెవెన్యూ అధికారులు ఓ నివేదికను అందించారు. నివేదికలో ఏముందనే విషయం బయటకు రాలేదు.
I would be checking the land violations of Saraswathi power in machavaram , palnadu Jilla. https://t.co/YpShIpNPde
— Pawan Kalyan (@PawanKalyan) November 4, 2024
మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సరస్వతి పవర్ భూములు పరిశీలనకు వెళ్తున్నట్లు పవన్ కల్యాణ్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. అలాగే జనసేన పార్టీ మీడియా విభాగం కూడా పవన్ కల్యాణ్ పల్నాడు జిల్లా పర్యటన విషయంపై సమాచారం ఇచ్చింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ పర్యటనతో సరస్వతి భూముల విషయంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 15 వందల ఎకరాలకు పైగా భూములను సరస్వతి సిమెంట్స్ కంపెనీ కోసం కేటాయించారు. తెదేపా ప్రభుత్వం ఈ భూ కేటాయింపులు 2014 తర్వాత రద్దు చేసింది.
అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ భూ కేటాయింపులు చేయటంతో పాటు లీజు గడువు యాభై ఏళ్లకు పొడిగించారు. కృష్ణా నది నుంచి నీటి కేటాయింపులు జరిపారు. కంపెనీ ఏర్పాటు చేయకపోయినా, కనీసం ఒక్క ఇటుక పెట్టకపోయినా వందల ఎకరాల భూములు కంపెనీ పేరుతో ఉన్నాయి. భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని హామీ కూడా నెరవేర్చలేదు. గతంలో సరస్వతి భూముల్లోకి వెళ్లిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో పాటు టీడీపీ నేతలపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులు చేశారు. పోలీసు కేసులు పెట్టారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అక్కడకు వెళ్తున్నారు. దీంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు - సరస్వతి పవర్ భూముల్లో అధికారుల సర్వే
15 ఏళ్లు అయినా పరిశ్రమ స్థాపించలేదు- సరస్వతీ భూములను స్వాధీనం చేసుకోవాలి
పల్నాడు జిల్లాలో భారీ భూ కుంభకోణం? - శాఖలను తప్పుదోవపట్టించి మాజీ సీఎం జగన్ అడ్డగోలు మేళ్లు!