ETV Bharat / politics

అసెంబ్లీ ఎన్నికల్లో ఓలెక్క లోక్​సభలో మరోలెక్క - కాంగ్రెస్ ఓటు బ్యాంకు తీరు భలే గమ్మత్తు గురూ - TELANGANA CONGRESS VOTE BANK 2024

Congress Telangana Lok Sabha Polls Results : లోక్​సభ ఎన్నికలో తెలంగాణ కాంగ్రెస్​ పార్టీ ఎనిమిది స్థానాలను సాధించింది. అయితే గతంలో గెలిచిన అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్​కు కొన్ని చోట్ల పరాభవం తప్పలేదు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అసెంబ్లీలో ఓడిన చోట లోక్​సభ ఎలక్షన్​లో గెలవడం. అయితే పార్లమెంటు ఎన్నికలో కాంగ్రెస్​ పార్టీ ఎక్కడ ఓడింది? ఏ స్థానంలో విజయం సాధించిందో చూద్దాం.

Congress Telangana Lok Sabha Polls Results
Congress Telangana Lok Sabha Polls Results (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 6, 2024, 11:51 AM IST

Congress Performance in Telangana Lok Sabha Election 2024 : అసెంబ్లీ ఎన్నికల్లో ఓ లెక్క, లోక్​సభ ఎన్నికలో మరోలెక్క అన్నట్లు ఉంది కాంగ్రెస్​ ఓట్లు సాధించిన తీరు. ఆరు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో 64 స్థానాలతో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ మిగిలిన నియోజకవర్గాల్లో రెండు, మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు జరిగిన లోక్​సభ ఎన్నికలో అవే అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీగా ఓటు బ్యాంకును పెంచుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలో గెలిచిన చోట కొన్నింటిలో మాత్రం కాంగ్రెస్​ ఓటు షేరింగ్​ తగ్గిపోవడం విశేషం.

కాంగ్రెస్​కు సిటింగ్​ ఎమ్మెల్యేలు 64 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నారు. అందులో 15 నియోజకవర్గాల్లో లోక్​సభ ఎన్నికలో ఆధిక్యం చేజారింది. మిగిలిన 49 నియోజకవర్గాలతో పాటు బీఆర్​ఎస్​ సాధించిన 12 స్థానాలు, బీజేపీ, సీపీఐ, ఎంఐఎం సాధించిన ఒక్కో స్థానంలో కూడా పార్లమెంటు ఎన్నికలో మెజార్టీ లభించింది. ఇలా మళ్లీ 64 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధిక్యం సాధించింది. ఇందులో ఆదిలాబాద్​, నిజామాబాద్​, మెదక్​, హైదరాబాద్​ లోక్​సభ స్థానాలు ఉన్నాయి.

నిజామాబాద్​ : ఈ లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓటమి పాలైంది. కానీ దీని పరిధిలోని నిజామాబాద్​ అర్బన్​, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం విజయం సాధించింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓటమిలైంది ఇక్కడ. కానీ పార్లమెంటు ఎన్నికలో మాత్రం అధికంగా ఓట్లు సాధించి మొదటిస్థానం సంపాదించడం విశేషం. అప్పుడు నిజామాబాద్​ అర్బన్​లో కాంగ్రెస్​ 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోగా, ఇప్పుడు 15,800 ఓట్ల ఆధిక్యం సాధించింది. జగిత్యాలలో అసెంబ్లీ ఎన్నికలో 16 వేల ఓట్లు తేడాతో ఓడిపోగా, ఇప్పుడు లోక్​సభలో 76,145 స్థానాలు గెలుచుకుని అగ్రస్థానం సంపాదించింది. కానీ నిజామాబాద్​ రూరల్​లో అసెంబ్లీలో 78 వేల ఓట్లోస్తే ఇప్పుడు అది 56,674కి పడిపోయింది.

మెదక్​ : మెదక్​లో కూడా కాంగ్రెస్​ పరాజయం పాలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్​ లోక్​సభ పరిధిలోని నర్సాపూర్​, సంగారెడ్డి నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ ఓటమి పాలైంది. కానీ ఇప్పుడు అక్కడే ఎక్కువ ఓట్లు సాధించి మొదటి స్థానం సంపాదించింది. మాజీ సీఎం కేసీఆర్​ నియోజకవర్గం గజ్వేల్​లో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఏకంగా 101 శాతం సీట్లు అధికంగా వచ్చాయి. ఇక్కడ శాసనసభ ఎన్నికలో కాంగ్రెస్​కు 32,568 ఓట్లతో బీఆర్​ఎస్​, బీజేపీల తరువాత మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఏకంగా 65,539 ఓట్లతో రెండో స్థానానికి చేరింది. మెదక్​ స్థానంలో అసెంబ్లీలో మెజార్టీ సాధించిన కాంగ్రెస్​, ఇప్పుడు లోక్​సభలో రెండోస్థానంలో నిలిచింది.

ఆదిలాబాద్​ : ఆదిలాబాద్​ లోక్​సభ స్థానం పరిధిలోని ఏడు సీట్లలో శాసనసభలో ఖానాపూర్​లో మాత్రమే కాంగ్రెస్​కు 58 వేల ఓట్లు వచ్చి 4వేల ఓట్ల ఆధిక్యం సాధించి నెగ్గింది. ఇప్పుడు లోక్​సభ ఎన్నికలో రెండోస్థానానికి పరితమైంది. బీజేపీ 75 వేల ఓట్లు సాధించింది. కానీ ఆసిఫాబాద్​, సిర్పూర్​లో మాత్రం లోక్​సభ ఎన్నికలో మొదటి స్థానం కాంగ్రెస్​ సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోల్చిచూసినా ఈ రెండు నియోజకవర్గాల్లో మెరుగైన ఓట్లను సాధించింది. మహబూబాబాద్​ లోక్​సభ నియోజకవర్గం పరిధిలోని భద్రాచలం సెగ్మెంట్​లో కాంగ్రెస్​ ఓడిపోయింది. కానీ ఇప్పుడు అదే సెగ్మెంట్​లో 34,231 ఓట్ల ఆధిక్యం సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

హైదరాబాద్​ : అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్​ హైదరాబాద్​లో కాంగ్రెస్​ తుస్సు మనిపించింది. కానీ లోక్​సభ ఎన్నికలో మాత్రం మూడు నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికలో కంటోన్మెంట్​ కోల్పోయిన ఇప్పుడు జరిగిన ఉపఎన్నికలో ఆ స్థానం సాధించింది. అసెంబ్లీలో సికింద్రాబాద్​ లోక్​సభ స్థానంలో అన్ని సెగ్మెంట్లలో ఓటమి పాలైన ఎంపీ ఎన్నికలో మాత్రం జూబ్లీహిల్స్​, నాంపల్లి నియోజకవర్గాల్లో మొదటి స్థానం సాధించింది. అయితే హైదరాబాద్​ లోక్​సభ స్థానం పరిధిలోని మలక్​పేట, చాంద్రాయణగుట్ట, చార్మినార్​లో అసెంబ్లీ ఎన్నికలో ఓడిన కాంగ్రెస్​ ఇప్పుడు ఇంకా తక్కువ ఓట్లకే పరిమితం కావడం విశేషం.

రేవంత్​ రెడ్డిని కలిసిన కాంగ్రెస్​ ఎంపీలు - అభినందనలు తెలిపిన సీఎం - Congress MPs Meet Revanth Reddy

సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి ఓటమి - కారణాలపై అధికార పార్టీలో అంతర్మథనం! - Congress Lost MP Seat Of Mahbubnagar

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.