Congress Vamshichand Reddy Challenges KCR : నీళ్లు, నిధులు, నియమాకాల పేరుతో పదవి పొందిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) రాష్ట్రాన్ని దివాళ తీయించారని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాలతో పాలమూరు జిల్లాలను సస్యశ్యామలం చేశామని, కేసీఆర్ కుటుంబం తప్పుడు ప్రచారం చేసిందని విమర్శించారు. పాలమూరుకు రావాల్సిన కృష్ణా జలాలు, ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంటే కేసీఆర్ ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.
AICC Vamshichand Reddy Fires on BRS : కేసీఆర్ అసమర్థ నాయకత్వంతో కృష్ణా నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం జరిగిందని వంశీచంద్‌రెడ్డి(AICC Vamshichand Reddy) దుయ్యబట్టారు. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజల కన్నీటి గాథలు చెప్పుకుంటే పోతే చాంతాడంత ఉందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌కు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన మహబూబ్‌నగర్ ప్రజలను ఆయన మోసం చేశారని మండిపడ్డారు. తాను తప్పు చేయలేదని చెప్పే దమ్ము ధైర్యం ఉంటే, కేసీఆర్ మహాబూబ్‌నగర్ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఎవరు చెప్పేది నిజమో ప్రజలే తేల్చుతారని అన్నారు.
AICC Vamshichand Reddy Letters to KCR : తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి, కల్వకుంట్ల కుటుంబం బాగుపడిందని వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరును పండబెట్టి మేడిగడ్డను(Medigadda) బొందపెట్టిందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు మరోసారి మోసం చేయడానికే మేడిగడ్డ పర్యటన చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు కేటాయించిన కృష్ణా నీటిని బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకోలేదన్నారు. పాలమూరు అంటే కేసీఆర్‌కు పగ ఉందని తెలిపారు.
కాళేశ్వరం రూపంలో రాష్ట్రంపై మోయలేని భారం మోపారు : ఉత్తమ్
రాష్ట్ర ప్రజలను బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని వంశీచంద్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు బీఆర్ఎస్ నేతల పర్యటనలో మేడిగడ్డలో లక్ష కోట్ల దోపిడీపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేపు పాలమూరులో బీఆర్ఎస్ ప్రభుత్వ బండారం బయటపెడతామని చెప్పారు. మేడిగడ్డను బొందలగడ్డ అన్న కేసీఆర్, వాళ్ల పార్టీ నేతలను అక్కడికి ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ఆలస్యానికి కేసులే కారణంగా పేర్కొన్న కేసీఆర్, ఆకేసులు వేసిన హర్షవర్థన్ రెడ్డి, నాగం జనార్ధన్‌రెడ్డిని బీఆర్ఎస్‌లో ఎలా చేర్చుకున్నారని నిలదీశారు.
"కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం జరిగింది. కృష్ణా వాటాలో మనకు రావాల్సిన నీటిని, కేసీఆర్ అసమర్థ పాలనతో ఉపయోగించుకోలేకపోయాము. వాటిని ఆంధ్రా పాలకులు దారి మళ్లించుకుని పోతుంటే కేసీఆర్ నోరు విప్పలేదు. కేసీఆర్‌కు పాలమూరు అంటే పగ. ప్రాజెక్టుల నిర్మాణాలతో రాష్ట్రాన్ని నిండా ముంచారు. కేసీఆర్‌కు దమ్ముంటే మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేయాలి". - వంశీచంద్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి
కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు - తెలంగాణ ప్రజల నమ్మకం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో లోక్‌సభ హీట్ - బీఆర్ఎస్, బీజేపీలకు రేవంత్ ఛాలెంజ్ - కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త జోష్