Congress Special Manifesto for Telangana 2024 : పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 'న్యాయ్ పత్ర' పేరుతో ఇటీవల జాతీయ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామో చెప్పేందుకు ఇవాళ తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఎన్నికల ప్రణాళికను రిలీజ్ చేయనున్నారు. రాష్ట్రంలో మాదిరిగా కేంద్రంలోనూ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తారో వివరించనున్నారు. విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు తదితర అంశాలకు ఇందులో చోటు కల్పించనున్నట్లు సమాచారం.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గత నెల 5న కాంగ్రెస్ పార్టీ 'న్యాయ్ పత్ర' పేరుతో జాతీయ స్థాయిలో మేనిఫెస్టోను ప్రకటించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు దిల్లీలో మేనిఫెస్టోను విడుదల చేశారు. సంక్షేమ సూత్రాలు, సంపద సృష్టి, ఉద్యోగాల కల్పనపై దీనిని రూపొందించినట్లు మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం వివరించారు.
'న్యాయ్ పత్ర'లోని కొన్ని ముఖ్యమైన అంశాలు
- దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కుల గణన
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 50 శాతం ఇస్తున్న రిజర్వేషన్ పరిమితి పెంచడం కోసం రాజ్యాంగ సవరణ
- ప్రజలందరి ఆరోగ్య సంరక్షణ కోసం రూ.25 లక్షల వరకు నగదు రహిత బీమా
- పేద మహిళలకు ఏడాదికి రూ.లక్ష ఆర్థిక సాయం
- కనీస మద్దతు ధర చట్టం
- దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను కఠినంగా అమలు
- రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ
- ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వ్ చేసిన పోస్టులను ఏడాదిలో భర్తీ
- ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్ రెట్టింపు
- ప్రతి జిల్లాలో లైబ్రరీలతో కూడిన అంబేడ్కర్ భవనాలు
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్
- ఉపాధి హామీ పథకం కూలీ రోజుకు రూ.400కు పెంపు
- అగ్నిపథ్ పథకం రద్దు
- ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష ఫీజుల రద్దు
- మార్చి 15 నాటికి ఉన్న విద్యా రుణాల మొత్తం రద్దు
- తప్పుడు వార్తల నియంత్రణకు 1978 నాటి ప్రెస్ కౌన్సిల్ ఇండియా చట్టానికి సవరణ
అభయహస్తం పేరిట - 37 అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
ప్రజాకర్షక హామీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో - ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి - ధరణి స్థానంలో భూమాత పోర్టల్