ETV Bharat / politics

17 పార్లమెంట్ స్థానాలకు 309 దరఖాస్తులు - గెలుపు గుర్రాల ఎంపిక కోసం రేపు పీఈసీ కీలక సమావేశం - Congress MP Tickets Applications

Congress PEC Meeting Tuesday : తెలంగాణలో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ మంగళవారం సమావేశం కానుంది. రాష్ట్రంలోని 17 లోక్​సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు 309 మంది టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా మహబూబాబాద్ నుంచి 47, వరంగల్ నుంచి 40 దరఖాస్తులు వచ్చాయి. అతి తక్కువగా మహబూబ్​నగర్ నుంచి 4, జహీరాబాద్ నుంచి 6, మెదక్ నుంచి 10 అర్జీలు వచ్చినట్లు హస్తం పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Congress
Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 5, 2024, 8:56 AM IST

Congress PEC Meeting Tuesday : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం, గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్రంలోని 17 లోక్​సభ స్థానాల నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు టికెట్ల కోసం 309 మంది నాయకులు అర్జీ పెట్టుకున్నారు. ఇందులో పార్టీ నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన అధికారులు, కళాకారులు కూడా ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. కొంతమంది అధికారులుగా కొనసాగుతూనే, లోక్​సభ టికెట్ల కోసం అర్జీ చేసుకోగా, మరికొందరు పదవీ విరమణ పొందిన అధికారులు కూడా దరఖాస్తు చేసుకున్నారు.

Congress Exercise Lok Sabha Candidates : 17 నియోజకవర్గాలకు అందిన అర్జీలను (Congress MP Tickets Applications) పరిశీలించినట్లయితే సగటున ఒక్కో నియోజకవర్గానికి 18 మందికి పైగా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అందులో ప్రధానంగా అత్యధికంగా ఎస్టీ రిజర్వ్ స్థానమైన మహబూబాబాద్ నుంచి 47 మంది దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్ నుంచి 40 మంది, పెద్దపల్లి నుంచి 29 మంది, భువనగిరి నుంచి 28 మంది ఉన్నారు. అదే విధంగా మహబూబ్​నగర్​లో అతి తక్కువ అర్జీలు వచ్చాయి. కేవలం నలుగురు మాత్రమే రేస్​లో ఉన్నారు. జహీరాబాద్ నుంచి ఆరుగురు దరఖాస్తు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ - ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు షురూ

పార్లమెంట్​ నియోజకవర్గాల వారీగా : ప్రధానమైన నాయకుల్లో సికింద్రాబాద్ నుంచి కోదండరెడ్డి, అనిల్​కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాలస్వామిలు పోటీలో ఉన్నారు. నల్గొండ నుంచి పటేల్ రమేశ్​రెడ్డి, రఘువీర్​రెడ్డి, సర్వోత్తమరెడ్డిలు టికెట్లు ఆశిస్తున్నారు. భువనగిరి నుంచి చామల కిరణ్​రెడ్డి, బండ్రు శోభారాణి, డాక్టర్ సూర్యపవన్ రెడ్డిలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు.

Congress MP Tickets Applications 2024 : నాగర్​కర్నూల్ నుంచి మల్లు రవి (Mallu Ravi), మందా జగన్నాథం, చారకొండ వెంకటేశ్​, సంపత్​కుమార్ టికెట్ ఆశిస్తున్నారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, ఏ చంద్రశేఖర్, పెరికి శ్యామ్ రేస్​లో ఉన్నారు. మెదక్ నుంచి ఎం.భవానీ రెడ్డి, బండారు శ్రీకాంత్, చెరుకు శ్రీనివాస్ ​రెడ్డి పోటీ పడుతుండగా, చేవెళ్ల నుంచి భీమ్ భరత్, చిగురింత పారిజాత నరసింహారెడ్డి, మల్​రెడ్డి రామిరెడ్డి, కిచ్చనగారి లక్ష్మారెడ్డిలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు

మేడ్చల్ మల్కాజిగిరి నుంచి సినీ నిర్మాత బండ్ల గణేశ్​, హరివర్ధన్​రెడ్డి, సర్వే సత్యనారాయణ, జహీరాబాద్ నుంచి సురేశ్​ షెట్కర్ టికెట్ ఆశిస్తున్నారు. నిజామాబాద్​ నుంచి ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, ఇరవత్రి అనిల్ కుమార్, కరీంనగర్ నుంచి ప్రవీణ్​కుమార్ రెడ్డి, ఆకారపు భాస్కర్​రెడ్డి, కటకం మృత్యుంజయం, రుద్ర సంతోశ్​లు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. వరంగల్ నుంచి సిరిసిల్ల రాజయ్య, ఖమ్మం స్థానానికి నందిని భట్టి, రేణుకా చౌదరి, పొంగులేటి ప్రసాద్​రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు రేస్​లో ఉన్నారు. మహబూబ్​నగర్​ నుంచి చల్లా వంశీచంద్​ రెడ్డి, సీతాదయాకర్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి నరేశ్​యాదవ్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, సీతారాం ​నాయక్ ఉన్నారు.

తరలివచ్చిన ఆశావహులు - 300 దాటిన దరఖాస్తులు

Competition For Congress MP Tickets 2024 : పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారీ ఎత్తున 309 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అర్జీలకు సంబంధించి నియోజకవర్గం వారీగా గాంధీ భవన్​ వర్గాలు జాబితాను సిద్ధం చేస్తున్నాయి. మంగళవారం గాంధీ భవన్​లో జరగనున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీలో ఈ ఆశావహుల జాబితాపై చర్చించనున్నారు. నియోజకవర్గాల వారీగా ఇద్దరు లేక ముగ్గురు ప్రధానమైన నాయకులను పరిశీలించి అర్హులైన వారిని పీఈసీ ఎంపిక చేస్తుంది.

Congress PEC Meeting at Gandhi Bhavan : పార్టీ ఎన్నికల కార్యాచరణపై కూడా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చర్చించే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ హరీశ్​ చౌదరీ, సభ్యులు జిగ్నేశ్ మేవానీ, విశ్వజిత్ కధమ్, ఏఐసీసీ ఇంఛార్జ్​ కార్యదర్శులు, పీఈసీ కమిటీ సభ్యులు పాల్గొననున్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో విజయకేతనమే లక్ష్యం - రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల 'హస్త'గతం దిశగా కసరత్తులు

లోక్​సభ బరిలో కొత్త అభ్యర్థులు - మల్కాజిగిరి స్థానం నుంచి బడా వ్యాపారవేత్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.