ETV Bharat / politics

లోక్‌సభ ప్రచార బరిలో జోరు పెంచిన కాంగ్రెస్‌ - 15 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నేతల వ్యూహాలు - Congress campaign six guarantees - CONGRESS CAMPAIGN SIX GUARANTEES

Congress Party Election Campaign in Telangana : మిషన్​-15లో భాగంగా 15 లోక్​సభ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్​ ప్రచారంలో దూసుకెళుతోంది. సభలు, సన్నాహక సమావేశాలు, ర్యాలీలతో అభ్యర్థులు జనంలోకి వెళ్తున్నారు. ఆరు గ్యారెంటీలను వివరిస్తూ బీఆర్​ఎస్​, బీజేపీలపై విమర్శలు చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

Congress Party Election Campaign in Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 10:54 AM IST

అత్యధిక స్థానాలు గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్​ ప్రచారం - ఆరు గ్యారంటీలే శ్రీరామ రక్ష!

Congress Party Election Campaign in Telangana : లోక్​సభ ఎన్నికల ప్రచార బరిలో కాంగ్రెస్​ నేతలు కార్యకర్తలతో సమావేశమవుతూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ ప్రచార సభలో మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, సీనియర్​ నేత జానారెడ్డి పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఉత్తమ్​ విమర్శించారు. వరంగల్​ పార్లమెంటు స్థాయి విస్తృత స్థాయి సన్నాహక సమావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామన్నారు.

"ఈరోజు బీఆర్​ఎస్​, బీజేపీలలో అభ్యర్థుల కొరత ఉంది. ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారిని మళ్లీ తీసుకువచ్చి పార్లమెంటు ఎన్నికల్లో టికెట్​ ఇచ్చి పోటీ చేయిస్తున్నారు. ఈ రోజు వాళ్ల పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్​ ఒక మీటింగ్​లో సీఎం రేవంత్​ రెడ్డిని తిడుతున్నారు. అంబేడ్కర్​ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్​కు లేదు. ఓడిపోయి అధికారం కోల్పోయామనే ప్రస్టేషన్​ వారిలో ఉంది." - కొండా సురేఖ, మంత్రి

ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ ఫోకస్- స్టార్ క్యాంపెయినర్​గా రంగంలోకి సీఎం రేవంత్​రెడ్డి

Congress Prachar in Telangana : సోనియా గాంధీ త్యాగం, గొప్పతనం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్​ జిల్లా మరిపెడలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లోని నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ విభజన హామీల్లో ఒక్కటైనా అమలు చేయని బీజేపీకు రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదని విమర్శించారు.

"రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లు కావస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క హామీని అమలు చేయలేదు. చదువుకోవడానికి ఒక ఉన్నతమైన విద్యాసంస్థ లేదే. పరిశ్రమలను తీసుకురాలేదు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి ఏం చేయకపోతే ఏం ముఖం పెట్టుకుని ఊర్లలో ఓట్లు అడుగుతారు. బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థి వినోద్​కుమార్​ పార్లమెంటు సభ్యుడిగా ఈ నియోజకవర్గానికి ఏం చేశారు." - పొన్నం ప్రభాకర్​, రవాణా శాఖ మంత్రి

ఎన్నికల ప్రచారంలో జగ్గారెడ్డి : జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. లోక్​సభ ఎన్నికల్లో మెదక్​ ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి కోరారు. హైదరాబాద్​ దిల్​సుఖ్​నగర్​లోని కార్యకర్తల సమావేశంలో సునీతా మహేందర్​ రెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్​పేటలోని మెదక్​ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్​ఎస్​పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

బీజేపీ బీఆర్​ఎస్​ లోపాయికారి ఒప్పందంతో కాంగ్రెస్​పై విమర్శలు చేస్తున్నాయి : తుమ్మల

మల్కాజిగిరిపై కాంగ్రెస్ గురి - భారీ మెజార్టీతో గెలిచేందుకు స్పెషల్ ఆపరేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.