ETV Bharat / politics

మూడో రోజు భారీ సంఖ్యలో వెల్లువెత్తిన దరఖాస్తులు - ఎంపీ టికెట్ల కోసం ఆశావహుల పోటీ

Congress MP Candidates 2024 Telangana : రాబోయే పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ తరఫున పోటీ చేసేందుకు భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. దరఖాస్తుకు మూడో రోజైన ఇవాళ, ఆశావహుల నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

Congress MP Candidates 2024 Telangana
మూడో రోజు భారీ సంఖ్యలో వెల్లువెత్తిన దరఖాస్తులు - ఎంపీ టికెట్ల కోసం ఆశావహుల పోటీ
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2024, 9:11 PM IST

Congress MP Candidates 2024 Telangana : లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి మూడో రోజు భారీ సంఖ్యలో దరఖాస్తుల వెల్లువ వచ్చింది. ఇవాళ మంచి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వేశారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. నిన్నటి వరకు 34 దరఖాస్తులు రాగా ఇవాళ భారీగా దరఖాస్తులు వచ్చినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. మల్కాజిగిరి, వరంగల్‌ నియోజక వర్గాల నుంచి పోటీకి మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ దరఖాస్తు చేశారు.

సికింద్రాబాద్‌ నుంచి కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి దరఖాస్తు చేయగా, మల్కాజిగిరి నుంచి పోటీ కోసం సినీ నిర్మాత బండ్ల గణేష్‌ దరఖాస్తు చేశారు. ఇక మహబూబాబాద్‌ నుంచి పోటీకి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌(Registrar) బట్టు రమేష్‌ నాయక్‌ దరఖాస్తు చేశారు. ఖమ్మం నుంచి పోటీ కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సోదరుడు ప్రసాద్‌ రెడ్డి దరఖాస్తు చేయగా, సికింద్రాబాద్‌ నుంచి పోటీ కోసం ఫ్రొఫెసర్‌ విద్యశ్రవంతి దరఖాస్తు చేశారు.

Congress on MP Seats : మెదక్‌ నుంచి పోటీ కోసం పీసీసీ అధికార ప్రతినిధి ఎం.భవానీ రెడ్డి దరఖాస్తు చేయగా, ఖమ్మం, సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్ కోసం గాంధీ భవన్‌లో మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు దరఖాస్తు చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కొత్తగూడెం టిక్కెట్ ఈయన ఆశించారు. ఇవాళ తన సన్నిహితుల ద్వారా గాంధీ భవన్‌లో(Gandhi Bhavan) దరఖాస్తు వేయించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. గాంధీభవన్​లో చేవెళ్ల పార్లమెంట్ టికెట్ కోసం బడంగ్ పేట్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.

Congress To Focus On 17 Seats In Lok Sabha : కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ టికెట్ల కోసం రెండో రోజు 35 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) భార్య నందిని ఖమ్మం పార్లమెంటు టికెట్‌ ఆశిస్తున్నారు. ఆమె తరఫున అనుచరులు గురువారం గాంధీభవన్‌లో దరఖాస్తు అందచేశారు. ఖమ్మం టికెట్‌ కోసం పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు కూడా దరఖాస్తు చేశారు. భువనగిరి టికెట్‌ కోసం పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌ దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ మంద జగన్నాథం నాగర్‌కర్నూల్‌, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌ మల్కాజిగిరి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత నిజామాబాద్‌, న్యాయవాది చల్లూరి మధు వరంగల్‌, కె.నగేశ్‌ భువనగిరి టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

లోక్​సభ బరిలో కొత్త అభ్యర్థులు - మల్కాజిగిరి స్థానం నుంచి బడా వ్యాపారవేత్త!

14 లోక్​సభ స్థానాలే టార్గెట్ - గెలుపు గుర్రాల ఎంపికపై నేడు కాంగ్రెస్​ కీలక సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.