Congress Joinings Telangana : బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల నాయకులు కొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని తరచూ చేస్తున్న వ్యాఖ్యలతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అప్రమత్తమైంది. ఆసక్తి కనబరిచే గులాబీ పార్టీ నాయకులను చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టే వ్యూహాన్ని అమలు చేస్తోంది. అయితే వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల (Parliament Elections 2024) తర్వాత చేరికలను ప్రోత్సహించాలని భావించినప్పటికీ, తాజా రాజకీయ పరిణామాలతో ముందడుడు వేయాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.
Congress Party joinings in Telangana : కాంగ్రెస్‌లో ప్రముఖ నాయకుల చేరికకు ముహూర్తం ఖరారు
BRS Leaders Jump to Congress : పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని తాజా పరిస్థితుల్ని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లి అనుమతి పొందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఉప మేయర్ బాబా ఫసీయుద్దీన్, పటాన్‌చెరుకు చెందిన నీలం మధు, ఆప్ మాజీ నాయకురాలు ఇందిరా శోభన్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో గాంధీభవన్‌లో పలువురు బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) చేరనున్నారని హస్తం పార్టీ వర్గాలు వెల్లడించాయి. వికారాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జడ్పీ ఛైర్పర్సన్ అనితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నట్లు వెల్లడించారు.
Today Telangana Congress Joinings : బీజేపీ, బీఆర్ఎస్లకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలకు చెందిన దాదాపు 16 మంది ప్రజాప్రతినిధులు హస్తం గూటికి చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. వీరు కాకుండా మరో 20 మందికిపైగా కార్పొరేటర్లు కూడా టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో పాటు మరికొంత మంది నాయకులు చేరికల (Congress Joinings) విషయంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు సంప్రదింపులు పూర్తి చేసి, చేరేందుకు సుముఖత వ్యక్తం చేసిన తరువాత పార్టీ దృష్టికి తీసుకెళ్లి ముహూర్తం నిర్ణయిస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల జాబితా సిద్ధం - ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం
కాంగ్రెస్‌లో శరద్ పవార్ ఎన్సీపీ విలీనం? క్లారిటీ ఇచ్చిన సుప్రియ