ETV Bharat / politics

రేపే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా మరో ఆరుగురికి ఛాన్స్! - Telangana Cabinet Expansion 2024 - TELANGANA CABINET EXPANSION 2024

Telangana Cabinet Expansion 2024 : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తైంది. ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చినట్లైతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం దిల్లీకి వెళ్లనున్నారు. అధిష్ఠానం ఆమోదిస్తే కేబినెట్ విస్తరణపై రాత్రికే నిర్ణయం ప్రకటించి, గురువారం ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది. ఈ విస్తరణలో నలుగురికి మంత్రి పదవులు, ఒకరికి డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్ పదవి దక్కే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి.

Telangana Cabinet Expansion 2024
Telangana Cabinet Expansion 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 9:18 AM IST

TG Cabinet Expansion Updates 2024 : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కసరత్తు తుది అంకానికి చేరుకుంది. ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఏఐసీసీ యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్​కుమార్‌ రెడ్డితో మరోసారి చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, రంగారెడ్డి నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్తల్‌ శాసనసభ్యుడు శ్రీహరి ముదిరాజ్‌ పేర్లు దాదాపు కొలిక్కివచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Revanth Govt Focus On Cabinet Expansion : భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రె‌డ్డి గెలుపులో కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయనకు సైతం మంత్రివర్గంలో అవకాశం కల్పించేందుకు ఏఐసీసీతోపాటు పీసీసీ సుముఖంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావును కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. 4 మంత్రి పదవులు వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఏఐసీసీ భావిస్తోంది.

గురువారమే మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యే అవకాశం : అధిష్ఠానం నుంచి పిలుపు వస్తే సీఎం, ఉప ముఖ్యమంత్రి బుధవారం దిల్లీకి వెళ్లనున్నారు. చర్చల అనంతరం రాత్రికే మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక మంత్రి పదవిని హైదరాబాద్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతకు, మరో పదవి బీసీ లేదా ఎస్టీ వర్గాలకు రిజర్వ్‌ చేసి పెడుతున్నట్లు సమాచారం. గవర్నర్ కోటా కింద నామినేట్‌ చేసిన ఎమ్మెల్సీల వ్యవహారం కోర్టులో ఉన్నందున తుది నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని పీసీసీ భావిస్తోంది.

అన్ని అనుకున్నట్లు జరిగినట్లయితే గురువారం మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్‌, చీఫ్‌ విప్‌ పదవులకు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రుల శాఖల మార్పుపైనా కాంగ్రెస్‌ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీఎంతోపాటు 11 మంది మంత్రులు ఉండగా మ‌రో ఆరుగురిని నియమించే అవకాశం ఉంది.

శాఖల సర్దుబాటుపై సర్వత్రా ఆసక్తి : స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్కకు హోం శాఖ కేటాయించవచ్చంటూ, ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి సహా మంత్రులందరి వద్ద రెండు లేదా అంత కంటే ఎక్కువ శాఖలున్నాయి. అయితే, కొత్తగా వచ్చే మంత్రులకు ఏ విధంగా సర్దుబాటు చేస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

చంద్రసేన క్యాబినెట్​లో యువ'గళం' - ప్రభుత్వానికి ఫ్రెష్‌ లుక్‌ తెచ్చేందుకు సాహసోపేత నిర్ణయం - 17 new faces in CM Chandrababu team

మిత్రధర్మం పాటిస్తూ లక్ష్యాల ప్రాధాన్యతతో మంత్రులకు శాఖలు కేటాయింపు - సంబరాలు చేసుకుంటున్న కూటమి నేతలు - Allotment Departments To Ministers

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.