ETV Bharat / politics

ఈ నెల 25న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా- కడప లోక్‌సభ బరిలో వైఎస్ షర్మిల! - Congress Candidates List in ap

Congress Candidates List for Andhra Pradesh Elections 2024 : ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో ఏపీలో అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే వివిధ అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఎంపిక చేసిన అధిష్ఠానం, ఈ నెల 25న అభ్యర్ధుల జాబితాను ప్రకటించనుంది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్​సభ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Congress Condemned PM Modi Comments in Boppudi Meeting
Congress Candidates List for Andhra Pradesh Elections 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 18, 2024, 7:24 PM IST

Congress Candidates List for Andhra Pradesh Elections 2024 : సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదల కావటంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వివిధ అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఎంపిక చేసిన ఆ పార్టీ ఈ నెల 25 తేదీన ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్ధుల జాబితాను ప్రకటించనుంది.

ప్రధానంగా ఏపీ కాంగ్రెస్​ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కడప లోక్​సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు సమాచారం. కడప లోక్​సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా ఏఐసీసీ నుంచి ఆమెకు సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

'ప్రశ్నించే నాయకుడు ఏపీలో లేరు - ఉక్కు ప్రైవేటీకరణను తెలుగువాళ్లం అందరం కలిసి అడ్డుకుందాం'

Congress Condemned PM Modi Comments in Boppudi Meeting : కాంగ్రెస్ పార్టీ-వైసీపీ వేర్వేరు కావంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాకూర్‌ ఖండించారు. ఎన్నికల షెడ్యూలు విడుదల అయ్యే వరకూ జగన్​తో స్నేహం చేసిందెవరని ఆయన ప్రశ్నించారు. రాజ్యసభలో సీఏఏ, వ్యవసాయ, ఆర్టీఐ బిల్లులను ఆమోదింపచేసుకునేందుకు జగన్ పార్టీ ఎంపీల మద్దతు తీసుకున్నదెవరని నిలదీశారు. ఏపీ హక్కుల కోసం పోరాటం చేసేది, ప్రత్యేక హోదా కోసం ప్రశ్నించేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని సామాజిక మాధ్యమం ఎక్స్​ ద్వారా తెలిపారు.

YS Sharmila Comments : పదేళ్ల పాటు రాష్ట్ర వినాశనంలో ముఖ్యపాత్ర పోషించిన బీజేపీ ఇప్పుడు తనపై దాడులు చేయటం ఏమిటని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఐదేళ్లుగా జగన్​తో అంటకాగుతూ అరాచకాలను అడ్డుకోకుండా అప్పులు తెచ్చుకోవాలని రాష్ట్రాన్ని నాశనం చేసుకోవాలని సహకరించిన నేతలు తనపై విమర్శలు చేయటం ఏమిటని నిలదీశారు.

జగన్​తో తెరచాటు స్నేహం నడిపింది ఎవరో చెప్పాలని, బీజేపీ పార్లమెంటులో పెట్టిన ప్రతీ బిల్లుకూ జగన్ సిగ్గువిడిచి సహకరించారని షర్మిల విమర్శించారు. మోదీ మిత్రులు అదానీ, అంబానీలకు ఆస్తులు కట్టబెట్టి రాజ్యసభ సీటు ఇచ్చిందీ జగన్ ప్రభుత్వమేనని ఆమె ఆరోపించారు. అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదామీదే అని పేర్కొన్న కాంగ్రెస్ హామీ బీజేపీకి వణుకుపుట్టిస్తోందని షర్మిల అన్నారు. కాంగ్రెస్-వైసీపీ ఒకటే అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఈ విధంగా స్పందించారు.

ప్రధాని వ్యాఖ్యలు ఖండించిన షర్మిల- వైసీపీతో తెరచాటు స్నేహం నడిపింది ఎవరంటూ నిలదీత

Congress Leader Tulasi Reddy Reaction : బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ ప్రసంగం రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశానిస్పృహలకు గురి చేసిందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా ప్రస్తావనే చెప్పలేదని, ప్రత్యేక ప్యాకేజీ ఊసే లేదని మండిపడ్డారు. పోలవరం, విశాఖ ఉక్కు ప్రస్తావనే లేదని అన్నారు. మోదీ మరోసారి ఏపీకి టోపీ పెట్టారని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క కాంగ్రెస్​తోనే సాధ్యమని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 సూత్రాల కార్యక్రమం అమలు చేస్తుందని తెలిపారు.

జగన్ పాలన తాలిబన్లను మించిపోయింది: కాంగ్రెస్ నేత తులసి రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.