ETV Bharat / politics

ఫుల్ స్వింగ్​లో ఆదిలాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారం - జెండా పాతేయాలని ప్రధాన పార్టీల ఆరాటం - ADILABAD ELECTION CAMPAIGN 2024 - ADILABAD ELECTION CAMPAIGN 2024

Political Heat In Adilabad : ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. సిటింగ్‌ స్థానాన్ని కాపాడుకునేందుకు బీజేపీ హిందుత్వ నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది. గ్యారంటీలు అమలు, ప్రజాపాలనపై కాంగ్రెస్‌ విస్తృత ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్‌, బీజేపీ వైఫల్యాలను బీఆర్ఎస్ ఎండగడుతోంది.

Political Heat In Adilabad
Political Heat In Adilabad
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 7:56 AM IST

ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంపై ప్రధాన పార్టీల స్పెషల్ ఫోకస్- అగ్రనేతలతో ప్రచారాలు

Political Heat In Adilabad : లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ నియోజకవర్గం ప్రధాన పార్టీలకు పరీక్ష పెడుతోంది. ఓటరునాడి పసిగట్టడం నేతలకు కష్టమవుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదిలాబాద్‌లో ఎన్నికల శంఖారావం పూరించారు. మే రెండో తేదీన ఆసిఫాబాద్‌కు రేవంత్‌రెడ్డి, ఐదో తేదీన నిర్మల్‌కు రాహుల్‌గాంధీ రానున్నారు.

BRS Party Election Strategies : మరోవైపు మే నాలుగో తేదీన మంచిర్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ రోడ్‌షో చేపట్టనున్నారు. కమలనాథులు సైతం జాతీయ నేతలతో ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మూడు పార్టీల నేతలు ఆదిలాబాద్‌ స్థానంపై ప్రత్యేక దృష్టిసారించటంతో ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు ముందు ఉమ్మడి జిల్లాలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. గులాబీ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు ఊరువాడ పర్యటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.15లక్షల రూపాయలు వేస్తానని ప్రధాని మోదీ, ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తున్నారు.

ఆకట్టుకునే హామీలతో ఓట్లవేట కొనసాగిస్తున్న ఎంపీ అభ్యర్థులు - జోరందుకున్న పార్టీల ప్రచారాలు - Lok Sabha Election Campaign

మోదీ చరిష్మానే నమ్ముకున్న బీజేపీ : ఆదిలాబాద్‌లో మరోసారి సత్తాచాటాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. సిటింగ్‌ ఎంపీ సోయం బాపురావుకు టికెట్‌ దక్కకపోవడం, మాజీ ఎంపీ రమేష్‌ రాఠోడ్‌ సహా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవటం పరీక్షగా మారుతోంది. మరోవైపు అభ్యర్థి గోడం నగేష్‌కు మద్ధతుగా ప్రచారానికి రావాల్సిన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే, విదేశాంగ మంత్రి జైశంకర్‌ పర్యటనలు రద్దు కావటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మే మొదటివారంలో ప్రధాని మోదీ, అగ్రనేతలు యోగి, అమిత్‌షా, నడ్డా సభలతో జిల్లా ప్రజల దృష్టిని ఆకర్షించాలని బీజేపీ కసరత్తులు చేస్తోంది.

CM Revanth Focus On Adilabad MP Seat : అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్‌ సీటుపై ప్రత్యేక దృష్టి సారించారు. బీఆర్ఎస్​కు చెందిన కీలక నేతలు పార్టీలో చేరటంతో బలం పుంజుకున్నట్లు కనిపిస్తున్నా సొంతపార్టీ నేతల మధ్య ఐక్యత లేకపోవటం కాంగ్రెస్‌లో నైరాశ్యానికి కారణమవుతోంది. జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా ఉన్న సీతక్క సైతం ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప శ్రేణులను ఏకతాటిపై నడిపించేందుకు కృషి చేయట్లేదనే అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. ఆసిఫాబాద్‌లో మే 2న సీఎం రేవంత్‌ రెడ్డి సభ , ఐదో తేదీన అగ్రనేత రాహుల్‌ గాంధీ నిర్మల్‌ సభను కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

అడవుల జిల్లాలో ఆసక్తికర పోరు - మరి ఆదిలా'బాద్' షా ఎవరో! - Adilabad LOK SABHA ELECTION 2024

లోక్​సభ ఎన్నికల వేళ రసవత్తరంగా ఆదిలాబాద్ రాజకీయం - గెలుపు గుర్రం కోసం అన్వేషణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.