ETV Bharat / politics

'సిద్ధం' నుంచి తుర్రుమన్న జనం - సీఎం సభలో నోట్ల కట్టలు, మద్యం సీసాలు - ap politics

CM YS Jagan Siddham Public Meeting: నాతో ఎవరు పొత్తు పెట్టుకోకున్నా నేను ఒంటరిని కాదు. పైన దేవుడున్నాడు. నాతో ప్రజలున్నారంటూ సీఎం జగన్‌ ప్రసంగాల్లో ఊదరగొడుతుంటారు. అది శుద్ధ అబద్ధమని శనివారం ఏలూరులో నిర్వహించిన సిద్ధం సభతో తేటతెల్లమైంది. నోట్ల కట్టలు పంచినా, మద్యాన్ని ఏరులై పారించినా, ప్రయాస పడి తరలించినా జగన్‌ సభ నుంచి జనం తుర్రుమన్నారు.

CM_YS_Jagan_Siddham_Public_Meeting
CM_YS_Jagan_Siddham_Public_Meeting
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 6:59 AM IST

'సిద్ధం' నుంచి తుర్రుమన్న జనం - సీఎం సభలో నోట్ల కట్టలు, మద్యం సీసాలు

CM YS Jagan Siddham Public Meeting: నా వెంట ఎవరున్నా లేకున్నా మీరుంటే చాలు అంటూ బహిరంగ సభల్లో సీఎం జగన్‌ ఊదరగొట్టే ప్రసంగాలు చేస్తున్నా పెద్దగా స్పందన కనిపించడం లేదు. శనివారం ఏలూరులో నిర్వహించిన సిద్ధం సభతో ఇది తేటతెల్లమైంది. సీఎం జగన్ ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే జనం ఇళ్ల బాట పట్టారు. వారం ముందు నుంచే సీఎం సభకు జనాన్ని తరలించాలని ప్రతి వాలంటీర్‌కు పార్టీ పెద్దలు లక్ష్యాన్ని నిర్దేశించారు. వారు సభలకు జనాన్ని తెచ్చేందుకు నానా యాతన పడ్డారు.

బోసిపోయిన గ్యాలరీలు: ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో జనాన్ని రప్పించేందుకు చాలాచోట్ల నాయకులు బతిమాలుకోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గానికి 70 బస్సులు ఏర్పాటు చేసినా, కేవలం పది బస్సుల్లో అదీ పల్చగా ప్రజలు వెళ్లారు. సీఎం ప్రసంగం మొదలయ్యే సరికే వెనకనున్న గ్యాలరీలు ఖాళీ అయ్యాయి. ప్రసంగం సగం ముగిసేసరికి మరిన్ని గ్యాలరీలు బోసిపోయాయి. అప్రమత్తమైన పోలీసులు, నాయకులు ముందు గ్యాలరీల్లో ఉన్నవారిని బయటికి రాకుండా అడ్డుకున్నారు.

సాయంత్రం వరకు నిల్చోలేక: సభకు వెళ్లిన జనం నానా అవస్థలు పడ్డారు. పల్లెల నుంచి శనివారం ఉదయం 8 గంటలకే బస్సులు బయల్దేరగా, మధ్యాహ్నానికి వేదిక వద్దకు జనం చేరుకున్నారు. అక్కడ మండుటెండలో ఉక్కపోతతో అల్లాడిపోయారు. పలువురు సొమ్మసిల్లి పడిపోగా, కొందరు వాంతులు చేసుకున్న దృశ్యాలు కనిపించాయి. ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ స్పృహతప్పి పడిపోగా, వైద్య శిబిరానికి తరలించి సెలైన్‌ పెట్టారు. సభ వద్ద కుర్చీలు లేకపోవటంతో సాయంత్రం వరకు నిల్చోలేక కొందరు సీఎం రాకముందే వెళ్లిపోయి బస్సుల్లో కూర్చున్నారు.

అడుగడుగునా నిబంధనలకు పాతర -'సిద్ధం' కోసం ఇంత విధ్వంసమా - ఇదేం పని జగనన్నా?

ఫ్లెక్సీలు కన్పించేందుకు చెట్ల కొమ్మలు కొట్టేసి: సభకు జనాన్ని తరలించేందుకు సుమారు 3 వేల వాహనాలు ఏర్పాటు చేయగా, ఏలూరుకు వచ్చే అన్ని మార్గాల్లోనూ ట్రాఫిక్‌ స్తంభించింది. ఉదయం 11 గంటలకే దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. సాయంత్రం సభ ముగిశాక దాదాపు 3 గంటల పాటు ట్రాఫిక్‌ సమస్య కొనసాగింది.

చెన్నై-కోల్‌కతా హైవేపై సభాస్థలికి సమీపంలో ఓచోట డివైడర్‌ను పగులగొట్టారు. సభ ప్రాంతంలో పిల్ల కాలువను కొంత పూడ్చేశారు. ఏలూరులో జగన్‌ ఫ్లెక్సీలు కన్పించేందుకు చెట్ల కొమ్మలు కొట్టేశారు. విద్యారంగాన్ని సంస్కరిస్తున్నామని చెప్పే సీఎం తన సభ కోసం ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షను వాయిదా వేయించారు. ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేసి మరీ, సుమారు వెయ్యి బస్సులు తీసుకొన్నారు.

ఒక్కొక్కరికి 500 రూపాయలు: సభకు హాజరైన వారికి వైసీపీ నేతలు ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పురుషులకు మద్యం సీసాలూ పంచారు. బస్సుల్లోనే బిర్యానీ పొట్లాలు ఇచ్చారు. మద్యం తాగిన కొందరు యువకులు బైక్‌పై వస్తున్న ఏలూరుకు చెందిన శ్రీనివాస్‌ను ఢీకొనడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.

సీఎం సభకు భారీగా జనసమీకరణ- ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించి బస్సులు తీసుకెళ్లిన అధికారులు

జనం సభ నుంచి వెళ్లిపోకుండా కాపలా: మద్య నిషేధం చేయకపోతే 2024లో ఓటు అడగనని ప్రగల్భాలు పలికిన జగన్‌, సభకు వచ్చిన వారిని మందులో ముంచేశారు. సిద్ధం సభ వైసీపీ కార్యక్రమమే అయినా అధికార యంత్రాంగాన్ని భాగస్వాముల్ని చేశారు. బందోబస్తు, భద్రత చర్యలను పర్యవేక్షించాల్సిన పోలీసులు, జనం సభ నుంచి వెళ్లిపోకుండా కాపలా కాశారు. సమీప పంచాయతీల నుంచి పారిశుద్ధ్య కార్మికులను నాలుగైదు రోజులుగా సభాస్థలిలోనే ఉంచి పనులు చేయించారు.

మీడియాపై ఆంక్షలు: సీఎం కార్యక్రమంలో మీడియాపై ఆంక్షల కత్తిపెట్టారు. కవరేజీకి ఏలూరు జిల్లా కార్యాలయంలో కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులకే ప్రవేశ పాసులు ఇచ్చారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5, మహా న్యూస్‌ మీడియాల్లోని ప్రతినిధులకు పాస్‌లు ఇవ్వలేదు. ఆయా సంస్థలకు పాస్‌లు ఇస్తే చర్యలు దారుణంగా ఉంటాయని వైసీపీ అధిష్ఠానం నుంచి హెచ్చరికలు వెళ్లినట్లు తెలుస్తోంది.

సీఎం సభకు వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు- దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు విలవిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.