CM Revanth Reddy Lok Sabha Election Campaign : లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నేటి నుంచి వరుస సభల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే రెండు రోజుల కేరళ పర్యటనను ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తొలుత మహబూబ్‌నగర్‌లో ఆ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మెట్టుగడ్డ నుంచి ర్యాలీగా సీఎం, చల్లా వంశీ సహా ఉమ్మడి పాలమూరుకు చెందిన ఎమ్మెల్యేలు కలెక్టరేట్‌కు వెళ్లనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం గడియారం కూడలి వద్ద జరిగే కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్ పాల్గొంటారు.
మహబూబాబాద్ జన జాతర సభకు సీఎం : అనంతరం మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జన జాతర సభలో సీఎం పాల్గొననున్నారు. ఇప్పటికే సభా ఏర్పాట్లను జిల్లా ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తదితరులు పరిశీలించారు. మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు లక్ష మంది తరలివచ్చేలా నేతలు భారీగా జన సమీకరణ చేస్తున్నారు.
ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా : రేవంత్‌రెడ్డి
"నిన్నటి నుంచి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు లక్ష మందికి పైగా జన సమీకరణ చేయాలనే ఉద్దేశంతోనే గత మూడు, నాలుగు రోజులుగా ఇక్కడి ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. అనేక మీటింగ్‌లు నిర్వహించుకున్నాం. మహబూబాబాద్ ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా ఇక్కడికి వచ్చి వెళ్లారు. స్థల పరిశీలన, అక్కడి ఏరియా, ఏఏ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎంత మంది జన సమీకరణ చేయాలన్నది సూచించారు. మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి 30 వేల మంది, డోర్నకల్ నియోజకవర్గం నుంచి 30 వేల మంది ఇలా లక్ష మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం." - మురళీ నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే
CM Revanth Visit to Mahabubabad : అధికారం చేపట్టిన నాలుగు నెలల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి మహబూబాబాద్ ఎన్నికల ప్రచార సభకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని మహబూబ్‌నగర్, మహబూబాబాద్‌లో పోలీసులు పటిష్ఠ భద్రతను కల్పించారు. మహబూబాబాద్ పర్యటన తర్వాత సీఎం హెలికాప్టర్లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు.
జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం : రేవంత్ రెడ్డి
ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ ఫోకస్- స్టార్ క్యాంపెయినర్‌గా రంగంలోకి సీఎం రేవంత్‌రెడ్డి