ETV Bharat / politics

'అభివృద్ధే వైఎస్సార్ ఆశయం - రాహుల్​ను పీఎం చేయాలన్నదే ఆయన లక్ష్యం' - CM REVANTH REDDY ABOUT YSR

CM Revanth Reddy Pays Tribute To YSR : దేశంలో అభివృద్ధి అనగానే గుర్తుకు వచ్చేది వైఎస్‌ఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 8, 2024, 1:27 PM IST

YS Rajashekar Reddy 75th Birth Anniversary
YS Rajashekar Reddy 75th Birth Anniversary (ETV Bharat)

YS Rajashekar Reddy 75th Birth Anniversary : వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా హైదరాబాద్​లోని పంజాగుట్ట సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. అనంతరం ప్రజాభవన్‌లో నిర్వహించిన వైఎస్ఆర్ ఫొటో ఎగ్జిబిషన్‌కు హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మీ, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, తదితర సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు.

రాహుల్‌ గాంధీ పాదయాత్రతో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారం : మూసీ ప్రక్షాళన చేయాలనే ఆలోచన వైఎస్‌ఆర్ స్ఫూర్తితోనే ప్రభుత్వం చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమం పేదలకు అందుతుంది అని పేర్కొన్నారు. గతంతో రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలని వైఎస్ఆర్‌ సంకల్పించారని తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే రాహుల్‌ను ప్రధానిని చేసే విధంగా తాము ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. గతంలో వైఎస్సార్ పాదయాత్రతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇటీవల రాహుల్‌గాంధీ పాదయాత్రతో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వెల్లడించారు.

"కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. రాహుల్‌గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాణిస్తున్నారు. ఇటీవల పార్లమెంటులో మోదీ విధానాలను రాహుల్‌ ఎదుర్కొన్నారు. దేశ ప్రధాని పదవికి రాహుల్‌గాంధీ ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడం వైఎస్‌ఆర్‌ ఆశయం. దాని కోసం అందరూ అండగా నిలవాలి. రాహుల్‌ను ప్రధానిగా చేయడానికి ఎవరు అడుగులు వేస్తారో వారే నిజమైన వైఎస్సార్ వారసులు. రాహుల్‌ ప్రధాని పదవికి వ్యతిరేకంగా అడుగులు వేస్తే వైఎస్‌ వ్యతిరేకులే." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

రాజకీయ పాఠాలు ఆయన దగ్గరే నేర్చుకున్నాం : తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు వైఎస్సార్ లాంటి గొప్ప మనిషిని చూడలేదని రేవంత్ అన్నారు. ప్రజలు కోరుకున్న పాలనను వైఎస్సార్ అందించారని, అందుకే ఇన్నేళ్లయినా ప్రజల గుండెల్లో వైఎస్సార్ నిలిచిపోవడం గొప్ప విషయం అని తెలిపారు. దేశంలో సంక్షేమం అంటే వైఎస్సార్ గుర్తుకువస్తారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం తన లక్ష్యమని వైఎస్సార్ రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సంధర్భంగా చెప్పారని గుర్తు చేశారు. వైఎస్సార్ జయంతి సంధర్భంగా 35 మందికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చినట్లు వెల్లడించారు. పార్టీ కోసం పనిచేసిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలనే స్పూర్తి వైఎస్సార్ ఇచ్చారని వివరించారు.

నేడు వైఎస్సార్ 75వ జయంతి - ఇడుపులపాయలో వేర్వేరుగా నివాళులర్పించిన జగన్, షర్మిల - YSR 75th Birth Anniversary

రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా- తెలుగు సీఎంల సమావేశం - CHANDRABABU REVANTH REDDY MEETING

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.