ETV Bharat / politics

రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తల చూపు - తిరిగొస్తున్న ఇండస్ట్రియల్ దిగ్గజాలు - Industries for Andhra Pradesh

INDUSTRIAL DEVELOPMENT : ఏపీ అభివృద్ధికి అడ్డంకిగా మారిన భూతాన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలు పారిశ్రామిక వర్గాలకు ఊరట కల్పిస్తున్నాయి. కేంద్ర సంస్థ భారత్​ పెట్రోలియం కంపెనీ (BPCL) రిఫైనరీ రాష్ట్రానికి రావడం ఖాయమేనని తెలుస్తుండగా.. జగన్​ దెబ్బకు గతంలో రాష్ట్రాన్ని వదలి వెళ్లిన మరికొన్ని పరిశ్రమలు సైతం తిరిగిరానున్నట్లు తెలుస్తోంది.

industrial_development
industrial_development (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 16, 2024, 3:20 PM IST

INDUSTRIAL DEVELOPMENT : ఆర్థిక, పారిశ్రామిక ప్రగతి తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పారిశ్రామిక వేత్తలతో ఇప్పటికే సంప్రదింపులు కొనసాగుతుండగా, మరోవైపు కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రాబట్టేలా కసరత్తు జరుగుతోంది. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరించేలా విశాఖలో ఐటీ, కోస్తా తీరంలో పారిశ్రామిక వాడలు, తిరుపతి సహా రాయలసీమలో ఫుడ్​ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా​ ఉపాధి కల్పనపై నూతన ప్రభుత్వం దృష్టి సారించింది.

రాష్ట్ర విభజన తొలినాళ్లలో అప్పటి టీడీపీ ప్రభుత్వం పరిశ్రమలకు రెడ్​ కార్పెట్​ పరిచింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో హెచ్​సీఎల్ (HCL) నుంచి మేధా టవర్స్, ఆటోనగర్‌లో సాఫ్ట్‌వేర్‌ టవర్స్‌, మల్లవల్లి, వీరపనేనిగూడెంలో భారీ పరిశ్రమలకు వందల ఎకరాలు కేటాయించింది. ఐటీ, స్టార్టప్‌ కంపెనీలకు అనేక ప్రోత్సాహకాలు కల్పించడంతోపాటు మౌలిక వసతులు, భవనాల ఏర్పాటుపైనా ప్రత్యేకంగా దృష్టిసారించింది. కొండలు, గుట్టలను చదునుచేసి పారిశ్రామికవాడలుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ఆరంభం కాగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్​ మోకాలడ్డారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇచ్చిన భూములను కొల్లగొట్టేశారు.

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మల్లవల్లి పారిశ్రామికవాడపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ అశోక్ లే ల్యాండ్ యూనిట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినా ప్రారంభించని దుస్థితి ఏర్పడింది. పార్లే ఆగ్రో పరిశ్రమ పనులు మధ్యలోనే నిలిచిపోగా పారిశ్రామిక వేత్తలు చేతులెత్తేశారు. చంద్రబాబు ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలు మూతపడేలా చేయడంలో వైఎస్సార్సీపీ సర్కారు విజయవంతమైంది.

పరిశ్రమ వర్గాలు ఏం కోరుకుంటున్నాయి? ప్రభుత్వం ఏం ఆశిస్తోంది? - PRATIDWANI ON Grabbing Investments

ఏటా 500 నుంచి 1500 పరిశ్రమలు : 2014 జూన్‌ నుంచి 2019 వరకూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 6582 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3038 పరిశ్రమలు ఏర్పాటు కాగా, ఐదేళ్లలో 2319 కోట్లు ఎంఎస్‌ఎంఈ రంగంలో పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో 67,428 మందికి ఉపాధి లభించింది. ప్రధానంగా కాటన్, టెక్స్‌టైల్స్‌ అండ్‌ గార్మెంట్స్, కెమికల్స్, ఆగ్రో, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఫార్మా, సిరామిక్, ప్లాస్టిక్, గోనెసంచులు, స్టీల్‌ సామగ్రి, రక్షణ రంగ విడిభాగాలు, ఆటోమొబైల్‌ అనుబంధ పరిశ్రమలు పెద్దసంఖ్యలో ఏర్పాటు కాగా రూ.7145 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 17 భారీ పరిశ్రమల ద్వారా రూ.2,339 కోట్ల పెట్టుబడులతో 6,820 మందికి ఉపాధి అవకాశాలు దొరికాయి.

రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలివే : చంద్రబాబు గత పాలనలో వీర్లుపాడు మండలంలోని నరసింహరావుపాలెంలో సహ్యాద్రి ఇండస్ట్రీస్‌, నందివాడలో ఉమా స్పిన్‌టెక్ ఇండియా, జగ్గయ్యపేటలోని తిరుమలగిరిలో ఇందూ టెక్స్‌టైల్స్‌, మదినేపల్లిలోని సింగరాయపాలెంలో గ్రోవెల్‌ ప్రొసెసర్స్‌, కృత్తివెన్నులోని మునిపెడలో ఎన్‌జీ పాస్ఫేట్స్‌, బాపులపాడు మండలంలోని కోడూరుపాడులో మిలేష్‌ మెరైన ఎక్స్‌పోర్ట్స్‌, రేమల్లెలో మోహన్‌ స్పిన్‌టెక్స్‌ ఇండియా, వత్సవాయి పరిధిలోని బహ్మవరంలో 4S స్పిన్‌టెక్, కోడూరు పరిధిలోని కవులూరులో ఎన్‌సీఎల్‌ ఆల్‌టెక్, కంచికచర్ల పరిధిలోని కీసరలో ఇన్వితా కెమికల్స్‌ తదితర సంస్థలు వచ్చాయి. మరో 11 భారీ పరిశ్రమలు కూడా నిర్మాణ దశలో ఉండగా మల్లవల్లిలోని అశోక్‌ లేలాండ్‌ లిమిటెడ్‌ కంపెనీ జగన్​ రాకతో ప్రారంభం కాకుండా నిలిచిపోయింది.

ఇలా చేస్తే.. ఏపీలో ఆహార పరిశ్రమ రంగం పరుగులు - Food processing industry

పారిశ్రామిక వాడల అభివృద్ధికి కృషి : మంత్రి టీజీ భరత్ - TG Bharat on Industrial Parks in ap

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.