CM Chandrababu Review On Various Policies: రాష్ట్రంలో మైనింగ్ పాలసీపై సీఎం చంద్రబాబు తుది కసరత్తు చేస్తున్నారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన క్వారీల వేలం వేయడమా అన్న అంశంపై మేథోమథనం చేస్తున్నారు. వివిధ పాలసీలపై వరుసగా రెండో రోజు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. రీచ్‌ల్లో తవ్వకాలను అనుమతించాలని ఇటీవలే ఇసుక పాలసీలో మార్పులు చేసింది. ఈ రోజు సాయంత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై సీఎం చర్చించనున్నారు. ఆదాయార్జన శాఖలపై సమీక్ష చేయనున్నారు. కేంద్ర పథకాలకు యూసీలు ఇచ్చే అంశంపైనా సమీక్షించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా చర్చించి అధికారులకు పలు సూచనలు చేయనున్నారు.
మంత్రివర్గ సమావేశంలో పాలసీలపై చర్చ: రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న నూతన పాలసీలపై రేపు మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర స్థితిగతులను మార్చేలా, పారిశ్రామికరంగాన్ని పరుగులు పెట్టించేలా కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఎన్నికల హామీలు అమలు చేసేలా రానున్న ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించేలా నూతన విధానం రూపొందించింది. వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా నూతన పాలసీ ఉన్నట్లు సమచారం. ముఖ్యమంత్రి వరుస సమీక్షలతో పలు శాఖల్లో నూతన విధానాలపై కసరత్తు కొలిక్కి వచ్చింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా కొత్త పాలసీల రూపకల్పన చేశారు.
"శభాష్ పవన్ కల్యాణ్ - ఎంతో ఆనందంగా ఉంది" - అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
కేబినెట్ ముందుకు 6 నూతన పాలసీలు: జాబ్ ఫస్ట్ ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం పాలసీలను సిద్ధం చేసింది. పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు, పొరుగు రాష్ట్రాల్లో ఉత్తమ విధానాలతో కొత్త పాలసీలు రూపొందించారు. రేపు కేబినెట్ ముందుకు దాదాపు 6 ప్రభుత్వ నూతన పాలసీలు వచ్చే అవకాశం ఉంది. పారిశ్రామిక అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ పారిశ్రామిక పార్కులు తదితర పాలసీలు క్యాబినెట్ ముందుకు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ముందుగా పెట్టుబడులు పెట్టిన వారికి అదనంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రతిపాదనలు రూపొందించారు.
ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అదనంగా 10 శాతం ప్రోత్సాహకం ఇవ్వాలని ఇండస్ట్రియల్ పాలసీ లో పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంలో కసరత్తు చేశారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామిక వేత్త అనే కాన్సెప్ట్‌తో ఎంఎస్ఎంఈ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తోంది. విద్యుత్ రంగం లో దేశంలో అగ్రగామిగా ఉండేలా క్లీన్ ఎనర్జీ పాలసీని రూపొందించారు.
'ఎంప్లాయిమెంట్ ఫస్ట్' ప్రభుత్వ విధానం - పెట్టుబడులు వచ్చేలా పాలసీలు: సీఎం చంద్రబాబు
సంక్రాంతికి 'పల్లె' కళకళలాడాలి - చంద్రబాబు అనుభవం మాకు ఎంతో బలం: పవన్ కల్యాణ్