CM Chandrababu Review on Industrial Development: రాష్ట్రంలో 'ఎంప్లాయిమెంట్ ఫస్ట్' అన్నదే ప్రభుత్వ విధానమని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా, "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్"కు మార్గం సుగమం చేసేలా కొత్త పాలసీల ఉంటాయని చెప్పారు. పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చేలా నూతన పాలసీలు ఉండాలన్నారు. సీఎం సూచనలు, పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు, ఉత్తమ ఫలితాలు ఇచ్చిన ఇతర రాష్ట్రాల విధానాల ఆధారంగా 7, 8 శాఖలపై అధికారులు ఇప్పటికే ముసాయిదాలు సిద్ధం చేశారు.
ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తే అదనపు రాయితీ: ఏ రాష్ట్రంతో పోల్చినా ఏపీ పారిశ్రామిక విధానం అత్యుత్తమంగా ఉండాలన్న సీఎం సూచనల మేరకు పెట్టుబడిదారుల ఫ్రెండ్లీ గవర్నమెంటుగా నిలిచేలా విధానాలకు రూపకల్పన చేస్తున్నారు. పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలను వచ్చే మంత్రివర్గ సమావేశం ముందుకు తీసుకొచ్చేలా కసరత్తు చేస్తున్నారు. పాలసీ అమల్లోకి వచ్చిన వెంటనే పెట్టుబడులతో వచ్చే మొదటి 200 కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు 10 శాతం అదనపు రాయితీ ఇవ్వనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక రాయితీ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు సీఎం చెప్పారు.
ఇండస్ట్రియల్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ నూతన పాలసీలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ గారు, టీజీ భరత్ గారు, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు.#IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/FMNshGNygo
— Telugu Desam Party (@JaiTDP) October 14, 2024
గ్రామగ్రామాన పండుగ చేద్దాం - 30 వేల పనులకు కూటమి శ్రీకారం
అమరావతిలో టాటా ఇన్నోవేషన్ హబ్: ఈ విషయంలో సాధ్యాసాధ్యాలు, విధివిధానాలను సమగ్రంగా అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. "ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త" అనే కాన్సెప్ట్‌తో ఎంఎస్ఎంఈ పాలసీ ఉండాలని దిశానిర్దేశం చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి అనువుగా అమరావతి కేంద్రంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు నిశ్చయించారు. రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో హబ్‌కు అనుంబంధ కేంద్రాలు కొలువుదీరుస్తారు.
ఆక్వా, ఫౌల్ట్రీ తరహా ఫలితాలు వచ్చేలా ఆహారశుద్ధి రంగాన్ని అభివృద్ధి చేయడంపై చర్చించారు. ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు 5 శాతం అదనపు ఇన్సెంటివ్ ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీపైనా చర్చించారు. సమీక్షకు మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు.
మద్యం దుకాణాల దరఖాస్తుల ఆదాయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
ఎదురు చూస్తున్న పల్లె పండుగ వచ్చేసింది! పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లు-బీటీ రోడ్లకు మోక్షం