ETV Bharat / politics

'వన్‌ ఫ్యామిలీ - వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌' నినాదంతో ముందుకు : సీఎం చంద్రబాబు - CM CHANDRABABU ON POLICIES

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. థింక్‌ గ్లోబల్లీ, యాక్ట్‌ గ్లోబల్లీ నినాదంతో ముందుకెళ్తున్నామని అన్నారు.

cm_chandrababu_on_policies
cm_chandrababu_on_policies (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2024, 6:59 PM IST

CM Chandrababu on Policies Approved in Cabinet Meeting: కేబినెట్​లో రాష్ట్ర అభివృద్ధికి 6 పాలసీలు ఆమోదించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఏపీ ఇండస్ట్రియల్, క్లీన్ గ్రీన్ ఎనర్జీ, ఏంఎస్ఏంఈ, ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ సహా 6 పాలసీలు రూపొందించామని మరికొన్ని విధానాలు తీసుకువస్తామని చెప్పారు. 'జాబ్ ఫస్ట్' అన్నదే తమ ప్రభుత్వ నినాదమని స్పష్టం చేశారు. ఏపీ యువత థింక్ గ్లోబల్, యాక్ట్‌ గ్లోబల్ అనే నినాదం తోనే ముందుకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు. మారుమూల గ్రామంలో కూర్చుని ప్రపంచ దేశాల్లో సేవలు అందించేలా ప్రణాళికలు తయారుచేశామని సీఎం చంద్రబాబు న్నారు.

రాష్ట్ర భవిష్యత్​ను మార్చేలా 6 విధానాలు: 'వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌' లాంటి నినాదాలతో ఈ విధానాలు రూపొందాయని సీఎం వివరించారు. 25 ఏళ్ల ముందు ఐటీ పాలసీ తయారు చేసి రాష్ట్రాన్ని పరుగులు పెట్టించామని గుర్తు చేశారు. ఉద్యోగం చేయడం కాదు ఉద్యోగాలు ఇవ్వాలని అప్పట్లోనే తాను చెప్పానని పేర్కొన్నారు. యువత భవిష్యత్, రాష్ట్ర భవిష్యత్​ను మార్చేలా ఈ 6 విధానాలు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్​ను అమరావతిలో ఏర్పాటు చేస్తామని వివరించారు. అమరావతిలో టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రధాన కార్యాలయం, విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, తదితర ప్రాంతాల్లో ప్రాంతీయ సెంటర్​లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రం నాలెడ్జి ఎకానమీ హబ్​గా మారేలా ఒక ఎకో సిస్టం తయారు చేస్తున్నామని సీఎం అన్నారు.

'వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌' నినాదంతో ముందుకు - కొత్త పాలసీలు రాష్ట్ర ప్రగతిని మారుస్తాయి: సీఎం (ETV Bharat)

ఉచిత ఇసుక విధానం ఫిర్యాదులు - చంద్రబాబు ఆగ్రహం

30 లక్షల కోట్ల పెట్టుబడులు: ఉత్తరాంధ్ర కూడా పోర్టులు, టూరిజంతో అభివృద్ధి చెందేలా కార్యాచరణ రూపొందించామని సీఎం అన్నారు. భావనపాడు పోర్టు పేరు మార్చేసి గత ప్రభుత్వం పనులు కూడా చేయలేదని విమర్శించారు. విలువ జోడింపు, స్పీడ్ ఆఫ్ డుయింగ్ బిజినెస్, డీ కార్బన్ సబ్సిడీ లాంటి కొత్త విధానాలు అమలు చేసి పెట్టుబడులు ఆకర్షిస్తామని వెల్లడించారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా రాష్ట్రం గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్​గా మార్చుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల్లో మార్కెటింగ్ వచ్చేలా మన ఉత్పత్తులను గ్లోబల్ బ్రాండ్​గా తీర్చిదిద్దుతామన్నారు. 40 బిలియన్ డాలర్లు ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నామని 30 లక్షల కోట్ల పెట్టుబడులను తేవడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

దెబ్బతిన్న ఏపీ బ్రాండ్​ను పునరుద్ధరించాలన్న ఉద్దేశ్యంతోనే ప్రణాళికలు రూపొందించాము. విదేశీ పెట్టుబడులు కూడా ఆకర్షించేలా కార్యాచరణ ఉంటుంది. రాయలసీమ, కోస్తాంధ్రలోని ఉద్యాన పంటల్లో మన రాష్ట్రమే నెంబర్ వన్​గా ఉందని ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకువచ్చాము. ఇక రాయలసీమను రతనాల సీమగా మార్చుతాము. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే నదుల అనుసంధానం చేసి ఆ ప్రాంతానికి నీళ్లు ఇస్తాము.- సీఎం చంద్రబాబు

ఐఏఎస్​లకు దక్కని ఊరట - పిటిషన్ డిస్మిస్ చేసిన తెలంగాణ హైకోర్టు

అన్న క్యాంటీన్లకు గతంలో ఏ రంగు వేశారు? - రంగులు చూసి పార్టీని ఎలా ని‌ర్ణయిస్తారు? : హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.