ETV Bharat / politics

మీ డ్రామాలు ఆపండి - 2029లోనే జమిలి ఎన్నికలు: సీఎం చంద్రబాబు - CM CHANDRABABU ON JAMILI ELECTIONS

మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టాగోష్టి - ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించాం వెల్లడి

CM Chandrababu
CM Chandrababu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

CM Chandrababu on Jamili Elections : జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో ముచ్చటించారు. జమిలిపై అవగాహన లేని వైఎస్సార్సీపీ పబ్బం గడుపుకోవటానికి ఏది పడితే అది మాట్లాడుతోందని ఆయన మండిపడ్డారు.

వారి నాటకాలు చూసి నవ్వుకుంటున్నారు: వైఎస్సార్సీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయన్న ఆయన, వాళ్లు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్​ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం అన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతోపాటు ప్రతి చోటా దీనిపై చర్చ జరగాలని, విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలని అన్నారు.

భవిష్యత్‌ తరాల బాగు కోసం చేసే ప్రయత్నం: 1996 నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరి కళ్లకూ కనిపిస్తున్నాయన్న సీఎం, 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందని అభిప్రాయపడ్డారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒకరోజు పెట్టి వదిలేసే కార్యక్రమం కాదన్న ఆయన, భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ఈ ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రేపటి తరం భవిష్యత్తు కోసమే ఈ విజన్ 2047 అని స్పష్టంచేశారు.

సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని తెలిపారు. ఈసారి పెట్టే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఎన్నో మార్పులు తీసుకొస్తామని అన్నారు. సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు- సమాధానాల రూపంలో దీనిని నిర్వహిస్తామని తెలిపారు. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చించాల్సిన అంశాలపై అజెండా పంపి వాటిపై సమాధానాలు కోరతామన్నారు. తద్వారా సమయాన్ని సద్వినియోగం జరగటంతో పాటు మంత్రులు- అధికారుల మధ్య ఇంట్రాక్షన్ పెరుగుతుందని అన్నారు.

ఆడ్వాణీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: ఆసుపత్రిలో చేరిన అడ్వాణీ త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. అడ్వాణీతో తనకు దశాబ్దాల కాలం నుంచీ అనుబంధం ఉందని గుర్తుచేశారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అడ్వాణీ సహకారం మరువలేనిదని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు.

ఈ నెల 16న లోక్​సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.