CM Chandrababu Dissatisfied with TDP MLA Candidates : వైఎస్సార్ జిల్లా రాజంపేటలో టీడీపీ ఓటమిపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను స్వయంగా ప్రచారానికి రావడంతో పాటు జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ సైతం ప్రచారం చేయడంతో పాటు రాజంపేటను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన తర్వాత సైతం ఓటమి చెందడం ఏమిటని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సగవాసి బాలసుబ్రహ్మణ్యంని ప్రశ్నించారు.
వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన వారి వల్లే ఓడిపోయిందా? : రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబుని రాజంపేటలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సగవాసి బాలసుబ్రహ్మణ్యం కలిశారు. ఓటమికి గల కారణాలపై నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ కంచుకోటలాంటి రాజంపేటలో ఓడిపోవడం ఏమిటంటూ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఓటమికి కారణాలను బాలసుబ్రహ్మణ్యం చంద్రబాబుకు వివరిస్తూ వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన వారిలో చాలా మంది హడావుడి చేశారు తప్ప, చివరకు ఆశించినంతగా పార్టీకి పని చేయలేదంటూ తెలిపారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంతో టీడీపీలో చిరకాలంగా ఉన్న వారికి ప్రాధాన్యం లేకపోవడంతో నష్టం జరిగిందని వివరించారు. వ్యూహాత్మకంగా కొందరు వైఎస్సార్సీపీ అనుకూలంగా పని చేశారని, ఓటమి భయంతో వైఎస్సార్సీపీ భారీగా నిధులు వెచ్చించిందని చంద్రబాబుకు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. పరిస్థితి తనకే మాత్రం సంతృప్తికరంగా లేదని చంద్రబాబు అన్నారని సమాచారం.
దుర్మార్గాలు, దమనకాండలపై పోరాడిన నాయకులు- వరించిన మంత్రి పదవులు - TDP Leaders Minister Posts
'ఆ విషయం నాకు తెలుసు' - జయచంద్రారెడ్డిపై చంద్రబాబు ఆగ్రహం : రెండు రోజుల ముందు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి సైతం చంద్రబాబును కలిశారు. ఈ సమయంలోనూ చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గెలిచే స్థానాన్ని పోగొట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు పని చేయకపోవచ్చని ముందే చెప్పానని దాన్ని పరిగణలోకి తీసుకుని ముందడుగు వేయాల్సిందని సూచించినట్లు సమాచారం. నియోజకవర్గంలో తనను ఓడిస్తే పార్టీ ఇన్‌ఛార్జి బాధ్యతలు తమకు వస్తాయనే ప్రయత్నాల్లో భాగంగా తన గెలుపు అవకాశాలను కొందరు గండికొట్టారని జయచంద్రారెడ్డి వివరించే ప్రయత్నం చేయగా ఆ విషయం తనకు తెలుసని ఇకపై పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందుగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన చర్యలను చంద్రబాబు జయచంద్రారెడ్డికి వివరించారు.
యువనేత సంచలనం - నారా లోకేష్ ప్రజాదర్బార్ - మంగళగిరి వాసుల సమస్యలకు మోక్షం - Nara Lokesh Praja Darbar