Class War in YSRCP: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుముంటున్నాయి. నాయకుల తీరు నచ్చట్లేదని కొంత మంది, కొత్త ఇన్ఛార్జీలు వద్దని మరికొంత మంది నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
YCP MLC Angry with MLA: గురజాల వైసీపీలో వర్గపోరు మరింత ముదిరింది. ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి పాతరేసి, ఆటవిక రాజ్యం నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. తన స్వగ్రామం గామాలపాడులో స్థానిక సర్పంచికి, ప్రభుత్వ విప్‌గా ఉన్న తనకు తెలియకుండా ఆసరా చెక్కులు పంపిణీ చేయడమేంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో గామాలపాడులో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులకు కృష్ణమూర్తికి వాగ్వాదం జరిగింది. పోలీసు బలగాలతో ప్రజాస్వామ్యాన్ని అణచాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి ప్రోటోకాల్ అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు.
నంద్యాల వైసీపీలో వర్గపోరు - ఎమ్మెల్యే తీరుపై జడ్పీటీసీ నిరసన
ఒక గ్రామంలో ప్రభుత్వ పథకాలు అమలుపరిచే భాగంలో గ్రామ సర్పంచ్‌కి, ఎమ్మెల్సీని ఒక ప్రభుత్వ విప్ అయిన తనను పిలవకుండా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారన్నారు. శాంతంగా ఉన్న పలనాడు గ్రామాల్లో గొడవలు రేపి పోలీసు బలగాలని మోహరించి ఆటవిక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలంటే కుదరదని ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని అన్నారు. 12వ వార్డు బీసీ కౌన్సిలర్ భర్త మహంకాళి నీలం రాజును గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి బెదిరిస్తున్న విధానం చూస్తుంటే పార్టీలో బీసీలకు ఉండే గౌరవం ఇదేనా అనిపిస్తుంది అన్నారు.
జగన్ పిలుపుతో నేతల గుండెల్లో పిడుగు - ఈ సారి కరివేపాకులు ఎవరో?
Former MLA resigns from YCP: వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు వైసీపీకు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఆదివారం ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో కార్యకర్తల మధ్య తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆదివారం వినుకొండ పట్టణంలోని కేజీఎల్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలుకు నరసరావుపేట పార్లమెంటు సీటు కేటాయించకపోవడం తనకు బాధ కలిగించిందని అన్నారు.
చెప్పిన వారికి టికెట్లు ఇవ్వలేదు - రాజీనామా చేసేందుకు ఎంతోసేపు పట్టదు: బాలినేని
అంతే కాకుండా స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యవహార శైలి తనకు నచ్చలేదని తన గెలుపు కోసం కృషి చేస్తే అవమానాల కు గురి చేశాడని అన్నారు. అందుకే ఇక పార్టీలో ఉండలేనని ఈ సందర్భంగా ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్దలకు తాను పరిస్థితులు వివరించిన పట్టించుకోకుండా ఆయనకు డబ్బులు ఉన్నాయని అందుకే టికెట్ ఇస్తున్నామని చెప్పినప్పుడే తాను ఆయనకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పానని తెలిపారు. ఈ రాజకీయాన్ని మార్చేందుకు తాను ప్రజాక్షేత్రంలోనే ఉంటానని భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని ఆత్మీయ సమావేశంలో మీడియా సాక్షిగా వెల్లడించాడు.