Chief Secretary Orders: ప్రభుత్వ వెబ్ సైట్ల నుంచి సీఎం, మంత్రుల ఫొటోలు, వీడియోలు తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ప్రజాప్రతినిధుల ఫొటోలనూ తొలగించాల్సిందిగా అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆస్తుల్లో రాజకీయ పరమైన ప్రకటనల్ని కూడా తీసివేయాల్సిందిగా స్పష్టం చేశారు. సచివాలయంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా (AP State Chief Electoral Officer Mukesh Kumar Meena)తో కలిసి వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాల్సిందిగా ఆదేశించారు.
ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి పనులు వాలంటీర్లకు వద్దు - కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు
ప్రభుత్వ వెబ్ సైట్ల నుంచి తక్షణం ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలను తొలగించాల్సిందిగా సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల్లో ఫొటోలు, ప్రకటనలు కూడా తొలగించాల్సిందిగా సూచనలు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో కలిసి రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫొటోలు, ఫ్లెక్సీలు తొలగించాలని సీఎస్ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాలకు హాజరైతే అలాంటి వారిపై విచారణ చేసి ఎన్నికల నిబంధనల ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈసీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కోడ్ అమల్లోకి వచ్చాక కొత్త పథకాలేవీ ప్రకటించేందుకు వీల్లేదని స్పష్టం చేశారు.
వైసీపీ సిద్ధం సభలకు బస్సుల తరలింపుపై సీఎస్‌కు అచ్చెన్నాయుడు లేఖ
బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నప్పటికీ నూతన ప్రాజెక్టులు, పథకాలు, రాయితీలు, గ్రాంట్లు మంజూరు చేసేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. అలాగే శంకుస్థాపన కార్యక్రమాలు కూడా పూర్తిగా నిషేధమని వెల్లడించారు. వర్క్ ఆర్డర్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇంకా ప్రారంభం కాని పనుల్ని చేపట్టకూడదని స్పష్టం చేశారు. అయితే, పూర్తైన పనులకు నిధులు విడుదల చేయటంపై ఎలాంటి నిషేధం లేదని సీఎస్ తేల్చి చెప్పారు. మరోవైపు వివిధ రకాల పింఛన్ల పంపిణీకి ఎలాంటి అభ్యంతరాలు లేవని వెల్లడించారు. కోడ్ అమల్లోకి వచ్చాక మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలపై సమీక్షలు చేసేందుకు వీల్లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: సీఎస్ జవహర్ రెడ్డి
ఉపాధి హామీ పథకం (Employment Guarantee Scheme) కింద నమోదైన లబ్ధిదారులకు పనులు కల్పించొచ్చని వెల్లడించారు. తక్షణం ప్రభుత్వ ఆస్తులపై ఉన్న అన్ని రకాల వాల్ రైటింగ్ లు, పోస్టర్లు, హోర్డింగ్ లు, కటౌట్ లు తొలగించాల్సిందింగా సూచించారు. బహిరంగ ప్రదేశాల్లోని బస్టాండ్లు, రైల్వే, రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, రాజకీయపరమైన ప్రకటనలను తొలగించేసేలా చర్యలు చేపట్టాలన్నారు. మరోవైపు మంత్రులకు అధికార వాహనాలను వినియోగించకుండా చూడాల్సిందిగా సూచనలిచ్చారు. జాతీయ ప్రాముఖ్యతా దినోత్సవాల్లో సీఎం, మంత్రులు హాజరైనా రాజకీయపరమైన ప్రసంగాలు చేయకూడదని సీఈఓ స్పష్టం చేశారు.
స్కిల్ సెంటర్లపై అధికారులతో సమీక్షించిన సీఎస్ - అనంతరం వెబ్సైట్ ఆవిష్కరణ