CM Jagan Tour : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు వెళ్లారు. విదేశీ పర్యటనకు వెళ్తున్న సీఎం వై.యస్. జగన్‌కు గన్నవరం విమానాశ్రయంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు వీడ్కోలు పలికారు. మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేశ్, ప్రభుత్వ విప్‌లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్యే మల్లాది విష్టు సీఎంకు వీడ్కోలు చెప్పారు.
విదేశాలకు జగన్- ఎన్నికల ఫలితాల వరకూ అక్కడే! - Jagan abroad tour
ఈ నెల 31న సీఎం జగన్ తిరిగి విజయవాడ వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. విదేశీ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ సీబీఐ కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా, ఫోన్నంబర్, ఈమెయిల్ వివరాలు అందించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
'అన్నొస్తే అంతే!' - అనకాపల్లి ప్రజలకు తప్పని అవస్థలు - CM Jagan Bus Yatra
జగనన్న సభ ఉంది జాగ్రత్త!- సిద్దం సభలతో జనం అవస్థలు - People in trouble in Jagan meetings