Chandrababu Will Take Oath As AP CM On June 12th: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల 8 లేదా 9న ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఏపీలో చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున తెలుగుదేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
Chandrababu Will Take Oath As AP CM : బీజేపీ పార్లమెంటరీ భేటీ తర్వాత, మరోసారి ఎన్డీఏ నేతల సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎన్డీఏ భేటీకి కూటమిలోని ఎంపీలంతా హాజరుకావాలని నిర్ణయించారు. ఎల్లుండి రాష్ట్రపతి ముర్మును కలిసి ఎన్డీఏను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. అందులో భాగంగా ఈ నెల 8న ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని, ఆ కార్యక్రమం అనంతరం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన చంద్రబాబు పాత్ర - Chandrababu Naidu became key Role