ETV Bharat / politics

గురువారం టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల: చంద్రబాబు - TDP Candidates For 2024 Elections

Chandrababu Will Announce TDP Second List : టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య పొత్తు కుదిరింది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను ప్రకటించగా మిగతా అభ్యర్థులపై కసరత్తు కొనసాగుతోంది. టీడీపీ ఇప్పటికే తొలి జాబితా ప్రకటించగా గురువారం రెండో జాబితా ప్రకటించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. మొదటి జాబితాలో పేరు రాని ఆశావహులు గతంలో చంద్రబాబును కలుస్తున్నారు. ప్రస్తుతం వారిలో ఉత్కంఠ నెలకొంది.

tdp second list
tdp second list
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 3:34 PM IST

Updated : Mar 13, 2024, 10:44 PM IST

Chandrababu Will Announce TDP Second List : ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కసరత్తు తుదిదశకు చేరుకుంది. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయడు తొలి జాబితాలో 94 మందిని ప్రకటించారు. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను గురువారం విడుదల చేస్తామని మీడియాతో చిట్​చాట్​లో చంద్రబాబు తెలిపారు. ఇందులో వీలైనంత మందిని ప్రకటిస్తామని తెలిపారు. జనసేన, బీజేపీ ఏయే స్థానాల్లో పోటీ చేసేది వారికి స్పష్టత ఉందని, సమయానుకూలంగా ఆ పార్టీలు వారి అభ్యర్థుల్ని ప్రకటిస్తాయని పేర్కొన్నారు.

తొలి జాబితాలో టీడీపీ 94 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఇప్పటికే కొలిక్కి వచ్చింది. బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ, జనసేనకు రెండు పార్లమెంట్‌, 21 అసెంబ్లీ స్థానాలు ఖరారయ్యాయి. జనసేన ఇప్పటికే ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. దాదాపు 50 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మొదటి జాబితాలో పేరు రాని ఆశావహులు గతంలో చంద్రబాబును కలుస్తున్నారు. ప్రస్తుతం వారిలో ఉత్కంఠ నెలకొంది.

ఖరారు కాని టీడీపీ, జనసేన రెండో జాబితా - ఉత్కంఠలో ఆశావహులు

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు తొలిజాబితా కింద 94మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించిన తెలుగుదేశం మలి జాబితా అభ్యర్థుల్ని గురువారం ప్రకటించనుంది. పొత్తులో భాగంగా 31అసెంబ్లీ స్థానాలను జనసేన, బీజేపీలకు కేటాయించటంతో మరో 50మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని తెలుగుదేశం ప్రకటించాల్సి ఉంది. అలాగే 8పార్లమెంట్ స్థానాల్లో జనసేన, బీజేపీలు పోటీ చేయాలని నిర్ణయించినందున 17మంది పార్లమెంట్ అభ్యర్థుల్నీ తెలుగుదేశం ఇంకా ప్రకటించాల్సి ఉంది. మొత్తం ఈ 67మంది అభ్యర్థుల్లో ఎంతమందిని మలిజాబితా కింద ప్రకటిస్తారనే ఉత్కంఠ ఆశావహులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. గురువారం ఎంత ఎక్కువ మందిని వీలైతే అంతమందిని ప్రకటించేస్తామని అధినేత చంద్రబాబు స్పష్టం చేయటంతో ఆ సంఖ్య ఎంతనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. గురువారం ప్రకటించేదే తుది జాబితా కాదనీ, మరో జాబితా కూడా ఉండవచ్చనే సంకేతాలు పార్టీ అధిష్ఠానం నుంచి వస్తున్నందున 67మందిలో గురువారం ఎంతమందికి చోటు దక్కుతుందనే సస్పెన్స్ సర్వత్రా నెలకొంది. సంఖ్యాపరంగా 9 అంకె సెంటిమెంట్ ను తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నందున ప్రకటించే అభ్యర్థుల సంఖ్య 27 ఉంటుందా లేక 36 ఉంటుందా లేక 45 ఉంటుందా లేక 54 ఉంటుందా అని ఎవరి అంచనాల్లో వాళ్లు మునిగితేలుతున్నారు.

బీజేపీ, జనసేనలకు కేటాయించే పార్లమెంట్ స్థానాలపై ఇప్పటికే నేతలకు స్పష్టత వచ్చినందున జనసేన, బీజేపీలకు వెళ్లే 31అసెంబ్లీ స్థానాలు ఏంటనే చర్చా నెలకొంది. అరకు, విజయనగరం, అనకాపల్లి, నరసాపురం, రాజమండ్రి, తిరుపతి పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని సమాచారం. కాకినాడ, మచిలీపట్న స్థానాల్లో జనసేన పోటీచేయనున్నట్లు తెలుస్తోంది. తమకు కేటాయించిన 21అసెంబ్లీ స్థానాల్లో జనసేన 6 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేయటంతో మరో 15మంది అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటించాల్సి ఉంది. బీజేపీ పోటీ చేసే 10స్థానాలు జనసేనతో కొన్ని ముడిపడి ఉన్నందున మొత్తం 25స్థానాలు ఏంటనేది తేలాల్సి ఉంది.

టీడీపీ - జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల

తెలుగుదేశం పోటీ చేసే 17పార్లమెంట్ స్థానాలను పరిశీలిస్తే, శ్రీకాకుళం స్థానానికి రామ్మోహన్ నాయుడు తిరిగి పోటీ చేయనుండగా, విశాఖ నుంచి గీతం విద్యాసంస్థల అధినేత భరత్ బరిలో దిగే అవకాశం ఉంది. ఏలూరు పార్లమెంట్ స్థానానికి కంభంపాటి రామ్మోహన్ రావు, భాష్యం రామకృష్ణ, బీసీ సామాజిక వర్గం నుంచి ఓ పోలీస్ అధికారి పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. అమలాపురం స్థానానికి బాలయోగి తనయుడు గంటి హరీష్ పోటీ చేసే అవకాశం ఉంది. విజయవాడ పార్లమెంట్ స్థానానికి కేశినేని చిన్ని, గుంటూరుకు పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేటకు లావు శ్రీకృష్ణదేవరాయుల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. బాపట్లకు ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు, తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పోటీ పడుతుండగా, మాదిగ సామాజిక వర్గానికే చెందిన మరో నేత ఈ సీటు కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఒంగోలు స్థానానికి మాగుంటు శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశం తరఫున పోటీచేసే అవకాశం ఉండగా, నెల్లూరుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. చిత్తూరు స్థానానికి దగ్గుమళ్ల ప్రసాద్, రాజంపేటకు సుకవాసి సుబ్రహ్మణ్యంల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కడపకు రెడ్డిప్పగారి శ్రీనివాసరెడ్డి పోటీ చేయాలని భావిస్తుండగా, వైఎస్ వివేక కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీ చేయాలని భావిస్తే, సమీకరణాలు మరనున్నాయి. హిందూపురం పార్లమెంట్ స్థానానికి మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి, నిమ్మల కిష్టప్పల మధ్య పోటీ ఉండగా, అనంతపురంకి పూలం నాగరాజు లేదా మరొకరిని పరిశీలించవచ్చని తెలుస్తోంది. కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని కురుబ సామాజిక వర్గానికి చెందిన నాగరాజు, భవానీ శంకర్ల మధ్య పోటీ నెలకొంది. నంద్యాలలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుంచి ఒకరు లేదా వేరెవ్వరనేది తేలాల్సి ఉంది

తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థులు వీరే

Last Updated : Mar 13, 2024, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.