ETV Bharat / politics

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు వరుస సమీక్షలు - Chandrababu Review on MLA Tickets - CHANDRABABU REVIEW ON MLA TICKETS

Chandrababu Review on MLA Tickets: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలకంగా వరుస సమీక్షలు చేపట్టినట్లు సమాచారం. రఘురామకృష్ణ రాజుకు సీటు సర్దుబాటుతో పాటు బీజేపీతో మరో సీటు సర్దుబాటుపైనా చంద్రబాబు కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై త్వరలోనే మంచి వార్త వింటానని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

Chandrababu Naidu Review on MLA Tickets
Chandrababu Naidu Review on MLA Tickets
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 11:38 AM IST

Chandrababu Naidu Review on MLA Tickets : ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలకంగా వరుస సమీక్షలు చేపట్టినట్లు సమాచారం. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు (MP Raghu Rama Krishna Raju)కు సీటు సర్దుబాటుతో పాటు బీజేపీతో మరో సీటు సర్దుబాటుపైనా చంద్రబాబు కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రఘురామ కృష్ణ రాజుకు నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఓ అసెంబ్లీ స్థానం సర్దుబాటు చేసే దిశగా అధిష్టానం ఉన్నట్లు సమాచారం.

ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే 3 సీట్లు పొత్తులో భాగంగా జనసేన - బీజేపీలకు కేటాయించినందున ఆ పార్లమెంట్​లో ఇప్పుడు మరో సర్దుబాటు సరికాదని జిల్లా నేతలు అభిప్రాయడ్డారు. అనపర్తికి బదులు బీజేపీకి మరో సీటు ఎక్కడ సర్దుబాటు అనే దానిపై కూటమి నేతలతో చంద్రబాబు కీలక చర్చలు కొనసాగుతున్నాయి. ఇవాళ, రేపట్లో సీట్ల సర్దుబాటు ఏమైనా ఉంటే కూటమి తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తా - రెండు రోజుల్లో గుడ్​ న్యూస్​: రఘురామ - RRR COMMENTS ON CONTESTING

MP Raghurama Raju Comments on Contesting Election: ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై త్వరలోనే మంచి వార్త వింటానని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు (MP Raghu Rama Krishna Raju) ఈ మధ్యనే ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తానని రఘురామ కృష్ణరాజు తెలిపారు. గతంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు తెలుగుదేశం శ్రేణులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ తను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా ? లేదా ఎంపీగా పోటీ చేస్తానా ? అనే విషయం తెలియదని అన్నారు. కానీ ఇంకో రెండు రోజుల్లో కచ్చితంగా తాను, ప్రజలు మంచి వార్త వింటారని అన్నారు. ఇప్పటి వరకు తమకు తెలుగుదేశం, బీజేపీ నుంచి ఎటువంటి సమాచారం లేదని రఘురామ అన్నారు. త్వరలో జగన్ గద్దె దిగడానికి సిద్ధంగా ఉండాలని, జరగబోయే ఎన్నికలలో కచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల రంగంలోకి రఘురామ కృష్ణ రాజు- కూటమి నేతల చర్చ - ap Election

టీడీపీకి అనపర్తి, బీజేపీ తంబళ్లపల్లె సీట్లు - సూత్రప్రాయంగా అంగీకరించిన నేతలు! - MLA Candidates Change

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.