ETV Bharat / politics

భూములన్నీ కాజేస్తే చూస్తూ ఊరుకోవాలా? - జగన్‌ ఫొటో ఉన్న పాస్‌ పుస్తకాన్ని చించి తగలబెడుతున్నా: చంద్రబాబు - Chandrababu Prajagalam Meeting - CHANDRABABU PRAJAGALAM MEETING

Chandrababu Prajagalam Meeting Nandyal : భూ హక్కుల చట్టం పేరుతో ప్రజల ఆస్తులను కాజేసే కుట్రకు ముఖ్యమంత్రి జగన్‌ పన్నాగం పన్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. నంద్యాల జిల్లా పాణ్యం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబు, పాస్‌ పుస్తకాలపై జగన్‌ ఫొటో ఎందుకని ప్రశ్నించారు. జగన్‌ ఫోటో ఉన్న పాస్‌ పుస్తకాన్ని చించి తగలబెట్టారు. పేదల ఆస్తిని కొల్లగొట్టే చట్టానికి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చరమగీతం పాడతామని భరోసా ఇచ్చారు.

TDP Chief Chandrababu Naidu Fires on Jagan
Chandrababu Prajagalam Meeting (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 6, 2024, 5:21 PM IST

Chandrababu Prajagalam Meeting : సైకో జగన్‌ను నమ్మి మరోసారి మోసపోవద్దని, మీ కోపాన్ని, ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల జిల్లా పాణ్యంలో ప్రజాగళం సభలో ప్రసంగించిన ఆయన ఈనెల 13న పోలింగ్‌ కేంద్రంలో వైఎస్సార్సీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు. వైఎస్సార్సీపీని భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టూ పూర్తిచేయలేని అసమర్థుడు జగన్‌ అని మండిపడ్డారు.

పాస్‌ పుస్తకాన్ని చించి తగలబెడుతున్నారు : ప్రజల పాస్‌ పుస్తకాలపై జగన్‌ ఫొటో ఎందుకు అని ప్రశ్నించిన చంద్రబాబు, జగన్‌ ఫొటో ఉన్న పాస్‌ పుస్తకాన్ని చించి తగలబెడుతున్నారని తెలిపారు. మీ భూములన్నీ కాజేస్తున్న ఆయన్ని చూస్తూ ఉరుకోవాలా అంటూ ప్రశ్నించారు. మీ ఆస్తులు కొట్టేసేవాడు కావాలా, ఆస్తులు పెంచేవాడు కావాలా ప్రశ్నించారు. మీ జీవితాలను మార్చే సూపర్‌ సిక్స్‌ పథకాలతో ముందుకొస్తున్నానన్న చంద్రబాబు, సూపర్‌ సిక్స్‌తో పాటు మోదీ గ్యారెంటీ కూడా కలుపుతామని హామీ ఇచ్చారు.

ఇంకెంతకాలం మోసం చేస్తారు: జగన్‌ అహంకారి, సైకో, విధ్వంసకారుడు, దోపిడీదారుడు అని విమర్శించారు. రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ జగన్‌ సర్వనాశనం చేశారన్న చంద్రబాబు, ఆయన మానసిక స్థితిని అధ్యయనం చేస్తే నార్సి విధానమని తేలిందని అన్నారు. పదేపదే అబద్ధాలు చెప్పి నమ్మించేదే నార్సి విధానమని పేర్కొన్నారు. వాళ్లు చెప్పిందే చేయాలని, లేకపోతే దాడిచేసి చంపేస్తారని ఆరోపించారు. లాడెన్‌, తాలిబన్లు, కిమ్‌కు తాత ఈ జగన్‌ అని విమర్శించారు. అబద్ధాలు చెప్పి ప్రజలను ఇంకెంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించారు.

పాసుపుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు : టీడీపీ అధినేత చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING

తనది విజన్‌ అని, జగన్‌ది పాయిజన్‌ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. తాను ముందుచూపుతో ఆలోచించి పనులు చేస్తానని, విద్యుత్‌ ఛార్జీలు 9 సార్లు పెంచిన ఘనుడు జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉర్దూ వర్సిటీ పెట్టానని, ఉర్దూ రెండో భాష తానే చేశానని చంద్రబాబు తెలిపారు. జగన్‌ది దిల్లీలో చీకటి ఒప్పందమని, గల్లీలో పోరాటమని పేర్కొన్నారు.

"తమ్ముళ్లు ఎక్కడైనా ఒక రోడ్డు వేశాడా, కాలువా తీశాడా. ఇదే నాజీ విధానం. ఒక్కడే బాగుంటాడు. మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తాడు. క్లాస్​ వార్​ అంటాడు, కానీ నేను పోరాడేది క్యాష్​ వార్​పైన. జగన్మోహన్ రెడ్డి దోచేసిన డబ్బులపైన. ఆ డబ్బు రావాల్సింది పేదవాడికి. నా పోరాటం సబబు అవునా కాదా. భూమి మీదా జగన్​దా, ఆయన అంటున్నాడు మీకు భూమి ఆయన ఇచ్చాడంటా. మీ ఆస్తులు కొట్టేసేవాడు మీకు కావాలా?" - చంద్రబాబునాయుడు, టీడీపీ అధినేత

ఇప్పుడు కోడికత్తి, గులకరాయి దాడి నాటకాలాడారని, కానీ వారి నాటాకాలను నమ్మే పరిస్థితులో ప్రజలు లేరని తెలిపారు. ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నారని, అధికారంలోకి మూడు రాజధానుల నాటకమాడారని ధ్వజమెత్తారు. మూడు రాజధానులు కాదు, ఒక్క రాజధాని అయినా కట్టారా అని ప్రశ్నించారు. ఐదేళ్లు పరదాలు కట్టుకుని జగన్‌ తిరిగారని, ఇవాళ జనం ముందుకొచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.

విధ్వంసానికి నాంది పలికారు: మీడియా ప్రశ్నిస్తుంటే వారిపైనా కేసులు పెట్టి వేధించారని అన్నారు. ప్రతిపక్షాలు మాట్లాడకూడదని జీవో నెం.1 తీసుకొచ్చిన జగన్​ సైకో అని అన్నారు. ప్రజావేదికను కూల్చేసి విధ్వంసానికి నాంది పలికాడని, రాయలసీమలో 198 ప్రాజెక్టులు పూర్తిగా రద్దుచేశారని దుయ్యబట్టారు.

నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న చంద్రబాబు, ఎక్కడా లేని బ్రాండ్లు, జే బ్రాండ్‌ మద్యం తీసుకొచ్చారని ఆరోపించారు. తమ హయాంలో ఇసుక ఉచితంగా ఇస్తే, ఇప్పుడు దాన్ని వ్యాపారం చేసుకని ప్రజలకు దొరక్కుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని, జగన్‌ దోచేసిన డబ్బుపై తాను పోరాడుతున్నానన్న చంద్రబాబు, దోచిన ప్రతి పైసాను ప్రజలు చేరాలని అన్నారు.

భూములన్నీ కాజేస్తే చూస్తూ ఊరుకోవాలా జగన్‌ ఫొటో ఉన్న పాస్‌ పుస్తకాన్ని చించి తగలబెడుతున్నా చంద్రబాబు (Etv Bharat)

వైసీపీది రౌడీయిజం - ఓటమి భయంతోనే హింసా రాజకీయాలు : చంద్రబాబు - Chandrababu Slams YSRCP

ఏపీలో 160 స్థానాల్లో కూటమి విజయం ఖాయం : చంద్రబాబు - Chandrababu At TDP workshop

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.