TDP Janasena BJP Alliance Seats Allotment : తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఖరారవ్వడంతో సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఎవరెక్కడ పోటీ చేయాలన్న దానిపై నేడు మూడు పార్టీల నేతలు చర్చించారు. హైదరాబాద్ నుంచి అమరావతి (Amaravati) చేరుకున్న చంద్రబాబు పవన్‌కల్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ (Shekawat)తో భేటీ అయ్యారు. వీరి మధ్య దాదాపు 8 గంటలపాటు చర్చలు కొనసాగాయి.
సిద్ధం సభల కోసం వైసీపీ వందల కోట్ల వ్యయం- అధికార దుర్వినియోగంపై విమర్శల వెల్లువ
సీట్ల సర్దుబాటుపై చర్చించి రెండు రోజుల్లో మలి జాబితా అభ్యర్థుల ప్రకటన చేసేలా చంద్రబాబు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన సీట్ల సర్దుబాటు అంశంపై పార్టీ నేతలతో ఆయన చర్చలు జరిపారు. పొత్తులో భాగంగా జనసేన-బీజేపికి 31 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలు కేటాయించారు. ముందు 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలకు ఒప్పందం కుదిరింది. ఇందులో జనసేన 24 స్థానాలు కేటాయించారు. ఇప్పుడు బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడంతో జనసేన తమకు కేటాయించిన మూడు స్థానాలను వదులుకుని 21 సీట్లలో పోటీ చేయనుంది. టీడీపీ సైతం తమ కోటా నుంచి ఒక అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చింది. అలాగే లోక్‌సభలో తొలుత జనసేన మూడు సీట్లు కేటాయించగా, బీజేపీకి 6 లోక్‌సభ స్థానాలు ఇవ్వడంతో జనసేన తమకు ఇస్తానన్న స్థానంలో ఒకటిని వదులుకుంది.
ఏపీలో కూటమి ప్రభంజనం ఖాయం - ఎన్నికలు ఏకపక్షమే: చంద్రబాబు
ఉదయం కేంద్ర మంత్రి షెకావత్, జయంత్ పాండా, శివ ప్రకాష్, పురందేశ్వరి, తదితర బీజేపీ నేతలు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అప్పటికే తెలుగుదేశం నేతలు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి చంద్రబాబు నివాసానికి వచ్చారు. జనసేన తరఫున పవన్ కల్యాణ్ (Pawan Kalyan), నాదెండ్ల మనోహర్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. సీట్ల సర్దుబాటుపై ఈ రోజు మూడు పార్టీల మధ్య దాదాపు 8 గంటల పాటు కీలక చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై చర్చించారు.
చిలకలూరిపేట బొప్పూడిలో ఈనెల 17న టీడీపీ-బీజేపీ-జనసేన తొలి ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనున్నారు . ఈ సభ ఏర్పాట్లను నారా లోకేశ్ పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి బహిరంగ సభ నిర్వహణకు 13 కమిటీలను నియమించారు. మూడు పార్టీల్లోని నేతలతో కమిటీలు ఏర్పాటు చేశారు. అలాగే అధికార పార్టీ పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలను అడ్డం పెట్టుకోని చేస్తున్న అక్రమాల తీరు, సచివాలయ వ్యవస్థ దుర్వినియోగం అంశాలపై సమావేశంలో నేతలు చర్చలు జరిగినట్లు సమాచారం. బీజేపీ నేతలతో సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు-పవన్ కల్యాణ్ మధ్య కొద్దిసేపు చర్చలు జరిగాయి.
బెజవాడలో పేట్రేగిపోతున్న వైసీపీ నేత అక్రమాలు- బూడిదతో సైతం కాసులు రాల్చుకునే ఘనుడు
తెలుగుదేశం - జనసేన- బీజేపీ పొత్తుతో సీఎం జగన్‌కు వణుకు మొదలైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. వైసీపీ సిద్ధం సభకు జనాదరణ కరవైందని, అందుకే గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్స్‌తో మాయ చేస్తున్నారని విమర్శించారు. అనంతపురంలో నిర్వహించిన శంఖారావం సభలో పాల్గొన్న లోకేశ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. యువతకు, ఉద్యోగులకు ఇచ్చిన ఏ హామీని వైసీపీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ ! - భారీగా ఏర్పాట్లు చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ
నిడదవోలు నుంచి కందుల: జనసేన తరఫున పోటీ చేసే మరో అభ్యర్థి పేరును జనసేనాని పవన్ కల్యాణ్ (Pavan Kalyan) ఈరోజు ప్రకటించారు. నిడదవోలు నుంచి జనసేన (jansena) తరపున పోటీ చేయటానికి కందుల దుర్గేష్ పేరును ఖరారు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా కందుల దుర్గేష్ పార్టీలో కీలకంగా ఉన్నారు. తెలుగుదేశంతో పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థిగా రాజమండ్రి రూరల్ సీటును కందుల దుర్గేష్ ఆశించారు. అయితే తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆ స్థానంలో ఉండటంతో దుర్గేష్‌కు న్యాయం చేస్తామని కొద్దిరోజుల క్రితం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ క్రమంలో కందుల దుర్గేష్‌కు నిడదవోలు సీటు కేటాయిస్తూ పార్టీ ప్రకటించింది. పొత్తులో భాగంగా 24 స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. ఇందులో ఇప్పటికే ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా కందుల దుర్గేష్ పేరు ప్రకటనతో మిగిలిన స్థానాలు అభ్యర్థులపై త్వరలో స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.