ETV Bharat / politics

పింఛన్ల పంపిణీ అంశంపై రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు లేఖ - Chandrababu Fight On Pensions - CHANDRABABU FIGHT ON PENSIONS

Chandrababu Fight on Pensions Issue in AP : పేదలకు పింఛన్లు ఇళ్ల వద్దనే ఇప్పించేలా తెలుగుదేశం దశల వారి పోరాటాన్ని విస్తృతం చేసింది. అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి ఉన్నతాధికారులు ఎన్నికల సంఘం పైనా ఒత్తిడి తీసుకొస్తున్నారు. పింఛన్ల పంపిణీ విషయంలో రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపించిన ఆయన దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో పాటు సీఎస్, ప్రధాన ఎన్నికల అధికారితోనూ స్వయంగా ఫోన్​లో మాట్లాడారు.

Pensions Distribution Issue
Chandrababu Fight on Pensions Issue in AP
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 2, 2024, 10:56 PM IST

పింఛన్ల పంపిణీ అంశంపై రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు లేఖ

Chandrababu Fight on Pensions Issue in AP : పింఛన్ల పంపిణీ ఆలస్యంలో అధికార వైఎస్సార్సీపీ తీరును రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలు తప్పుపట్టారు. పింఛన్ల పంపిణీ విషయంలో వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని తీవ్రంగా మండిపడ్డారు. దీంతో లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే ఇప్పించేలా తెలుగుదేశం దశల వారి పోరాటాన్ని విస్తృతం చేసింది. తాజాగా అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి ఉన్నతాధికారులు ఎన్నికల సంఘం పైనా ఒత్తిడి తీసుకొస్తున్నారు.

పింఛన్ల నిధులను బిల్లులకు చెల్లించారు- పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్షంపై విషప్రచారం: టీడీపీ నేతలు

సచివాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ల పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పింఛన్లు ఇంటింటికీ పంపకుండా సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డి చేస్తున్న కుట్రలనూ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఎండల్లో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు కిలో మీటర్ల దూరం వెళ్లలేరని ఇంటి వద్ద పింఛను అందించే ఏర్పాటు చేయాలని కోరారు. పింఛన్లు అందకపోవడానికి తెలుగుదేశం కారణమని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల వేళ తెలుగుదేశంపై బురద జల్లడం కోసం ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేయొద్దని వైసీపీ ప్రభుత్వం మురళీధర్ రెడ్డిపై రాజకీయ ఒత్తిడి చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

Pensions Distribution Issue : రాష్ట్రంలో తక్షణమే ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని చంద్రబాబు కోరారు. ఈ మేరకు సీఎస్‌ కు ఫోన్‌ చేసిన ఆయన పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా వారి ఇంటి వద్దనే పింఛను పంపిణీ చేయాల్సిన అసవరం ఉందని స్పష్టం చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వెంటనే పెన్షన్ పంపిణీ చేపట్టాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా తోనూ ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పెన్షన్‌ల విషయంలో వైసీపీ నేతలు, మంత్రులు చేస్తున్న తప్పుడు ప్రచారంపైనా చర్యలు తీసుకోవాలి విజ్ఞప్తి చేశారు.

పింఛన్ల పంపిణీపై సెర్ప్‌ కీలక ఉత్తర్వులు- కోడ్‌ ముగిసేవరకు ఇంటింటికీ ఉండదు

రాజకీయ ప్రయోజనాల కోసం వృద్ధులు, వికలాంగులను ఇబ్బందులు పెట్టే పాలకులు ప్రజలకు అవసరం లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజలందరూ కుట్రలను ఛేదించి. దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే పెన్షన్ 4వేల రూపాయలకు పెంచి అనవసర ఆంక్షలు తొలగించి ఇంటి వద్ద పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ నేతలు, జగన్ రెడ్డి బతుకే ఒక ఫేక్ బతుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం, అవాస్తవాలతో రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం వారి DNA లోనే ఉందన్నారు. పింఛన్ల పంపిణీకి తెలుగుదేశం ఎక్కడా అభ్యంతరం చెప్పలేదని ఇంటింటికీ పెన్షన్లు ఇవ్వకూడదని ఎన్నికల సంఘం కూడా ఆదేశించలేదని స్పష్టం చేశారు.

'ప్రభుత్వం కావాలనే పింఛన్లు తొలగిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.