Case Filed on Punch Prabhakar : సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇక మంత్రులపై దుర్భాషలాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న, అలాగే తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే పంచ్ ప్రభాకర్, విశాఖపట్నానికి చెందిన ఇంటూరి కిరణ్‌పై కేసు నమోదు అయ్యింది.
పంచ్ ప్రభాకర్‌పై కేసు నమోదు : చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లను దుర్భాషలాడుతూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిన పంచ్ ప్రభాకర్‌పై, అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో ఇద్దరిపై విజయవాడ సైబర్‌క్రైం పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ప్రభాకర్ రెడ్డి చీనేపల్లి అనే వ్యక్తి 'పంచ్ ప్రభాకర్' పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిగా పేరొందిన ఈయన, తన ఛానల్‌లో చంద్రబాబు, పవన్ ఫొటోలను ఉపయోగించి, అసభ్య పదజాలంతో వారిని తిడుతూ వీడియోలు పెట్టాడు. మొగల్రాజపురానికి చెందిన డి.రాజు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు అదుపులో వర్రా రవీందర్‌రెడ్డి - రహస్యంగా విచారణ
- చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి, వారిని దుర్భాషలాడుతూ పోస్టింగ్‌లు పెట్టిన వి.బాయి జయంతి అనే ఎక్స్ ఎకౌంట్ హోల్డర్‌పై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. మొగల్రాజపురానికి చెందిన సాదిరెడ్డి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
- అసభ్య పదజాలంతో పవన్ కల్యాణ్‌పై ఎక్స్‌లో పోస్టులు పెట్టిన వ్యక్తిపై నున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పాత పాయకాపురానికి చెందిన జనసేన నాయకుడు శౌరిశెట్టి రాధాకిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచారు : సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న విశాఖపట్నం చెందిన ఇంటూరి కిరణ్‌పై గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాల ప్రకారం సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ఎన్నికల అధికారి, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచారని కిరణ్ సోషల్ మీడియాల ప్రచారం చేస్తున్నారు. చేబ్రోలుకు చెందిన టీడీపీ కార్యకర్త హర్షద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట కృష్ణ చెప్పారు.
ANUSHA: "తెదేపా మహిళలపై... అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు"
'నేనింతే - నా తీరింతే - అసెంబ్లీకి రానంతే' - Jagan on Speaker Election Process