EC Case File on BJP MP Candidate Madhavi Latha : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివస్తున్నారు. నాయకులు, సినీ నటులు, అధికారులు ఇతర ప్రముఖులందరూ ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు వేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓటర్లు తమ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చి క్యూలో ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత అక్కడికి చేరుకుని ఓటర్లను పరిశీలించారు.
కొడంగల్లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి - మంత్రులు ఎక్కడెక్కడ వేశారంటే? - CM Revanth Reddy Casted Vote
BJP MP Candidate Madhavi Latha Case : ముస్లిం ఓటర్లలను తమ నకాబ్ తొలగించి మరి మాధవీలత పరిశీలించారు. వారి ఓటరు స్లిప్, ఓటరు ఐడీ కార్డులను తీసుకుని తదేకంగా చూస్తూ నీవా కాదా అన్నట్టు తనిఖీ చేశారు. అక్కడ ఉన్న ఎన్నికల అధికారులను కూడా ఓటర్లు వీరా కాదా అని తెలుసుకున్నారు. ఓటర్లు వివరాలు పూర్తిగా తనిఖీ చేసిన తరవాతే వారిని ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. ఓటర్లు జాబితాల్లో తేడాలు ఉన్నాయని, ఓటర్లు పేర్లు కొన్ని జాబితాలో లేవని ఆమె ఆరోపించారు. దీనికి అక్కడ పని చేస్తున్న ఎన్నికల సిబ్బంది స్పందించి పరిశీలిస్తున్నామని తెలియజేశారు. ఆమె ఓటర్లను నకాబ్ తొలగించి పరిశీలిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
BJP MP Candidate Madhavi Latha Video : సామాజిక మాధ్యమాల్లో మాధవీలత ముస్లిం మహిళలను పరిశీలించే దృశ్యాలు చక్కర్లు కొడుతున్న విషయం ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన నేతృత్వంలో మజ్లిస్ కార్యకర్తలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. విషయం తెలసుకున్న ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద మాధవీలతపై నమోదు చేయాలని తెలిపారు. దీంతో మలక్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఇవాళ ఉదయం హైదరాబాద్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటెత్తిన అధికారులు - ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే? - OFFICERS CASTED VOTE IN TELANGANA