ETV Bharat / politics

పట్టువదలని మంత్రి నిమ్మల - జోరువానలోనూ బుడమేరు గండి పనులు - Budameru repair work - BUDAMERU REPAIR WORK

Budameru Repair Works : బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు శరవేగంగా జరుగుగుతున్నాయి. మంత్రి రామానాయుడు గట్టుపైనే ఉండి పనులు పర్యవేక్షిస్తుండగా.. మంత్రి లోకేశ డ్రోన్​ ద్వారా పనుల పురోగతిని వీక్షిస్తూ ఎప్పటికప్పుడు అప్​డేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందిస్తున్నారు.

budameru_repair_work
budameru_repair_work (ETV bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2024, 5:30 PM IST

Budameru Repair Works : జోరు వర్షంలోనూ బుడమేరు 3వ గండి పూడ్చివేత పనులు కొనసాగాయి. మంత్రి రామానాయుడు గట్టుపైనే ఉండి పనులు పర్యవేక్షించారు. గండ్లు పూడిక జరిగితే గాని సింగ్ నగర్​కు వరద ఉధృతి తగ్గదనే ఉద్దేశంతోనే దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నానని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సింగ్ నగర్ ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్​ ఎప్పటికప్పుడు బుడమేరు గండ్లు పూడిక పనులపై సమీక్ష చేస్తున్నారని తెలిపారు. బుడమేరు గండ్లు పూడిక పనుల్లో అధికారులు, ఏజెన్సీల సహకారంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి నిమ్మల వెల్లడించారు.

బుడమేరు గండ్లు పూడిక పనులను నాలుగు రోజులుగా రాత్రింబవళ్లు దగ్గరుండి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చేయిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడుకు రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ధన్యవాదాలు తెలిపారు. ఆమె గండి పూడిక పనులను మంత్రి రామానాయుడుతో కలిసి పరిశీలించారు. బుడమేరు గండ్లు పూడిక పనులను అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసినా ఆపకుండా చేయించామని మంత్రి రామానాయుడు తెలిపారు.

గండ్లు పూడికతో వేలాదిమంది వరద ముంపు బాధితులకు ఉపశమనం కలిగించాలనే వర్షాన్ని సైతం లెక్కచేయలేదని అన్నారు. గండ్లు పూడిక ఏ మేరకు జరిగిందో గంట గంటకు మంత్రి లోకేశ్ డ్రోన్ ద్వారా పరిశీలిస్తున్నారని తెలిపారు. డ్రోన్ ద్వారా పరిశీలిస్తున్న గండ్లు పూడిక పనుల నివేదికను చంద్రబాబుకు లోకేశ్ అందిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రే అంత కష్టపడుతుంటే మంత్రులం తామెంత కష్టపడాలని రామానాయుడు అన్నారు. సాయంత్రానికి రెండో గండి పూడ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వీలైనంత త్వరగా 3వ గండిని కూడా పూడ్చుతామని మంత్రి రామానాయుడు వెల్లడించారు.

బుడమేరు కాలువపై గండ్లు పడిన ప్రాంతాన్ని పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం రెండో గండి పూడ్చేందుకు జలవనరుల శాఖ శ్రమిస్తోంది. ఈ సాయంత్రం రెండో గండిని పూడ్చి మూడో గండి పునరుద్ధరణ పనులు మొదలు పెడతామని మంత్రి నిమ్మల రామానాయుడు ఈటీవికి స్పష్టం చేశారు. రేపు మధ్యాహ్నం సమయానికి ఈ గండ్లు పూడ్చి విజయవాడ పల్లపు ప్రాంతాలకు వరద నీరు రాకుండా నిలుపుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్షల మంది ని రక్షించేందుకు శ్రమిస్తున్నారని ఆయన వెల్లడించారు.

విజయవాడ వరద విలయానికి గత ప్రభుత్వమే కారణం : మంత్రి నిమ్మల - Minister Nimmala About Budameru

సవాలుగా బుడమేరు గండి మరమ్మతు- పనులను పరిశీలించిన మంత్రి లోకేశ్​ - Ministers Lokesh Visit Budameru

బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు- కాలినడకన పరిశీలించిన మంత్రులు లోకేశ్​, రామానాయుడు - BUDAMERU FLOODS IN NANDIWADA

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.