ETV Bharat / politics

ఈ ఫలితాలు చాలా నిరాశపరిచాయి : లోక్‌సభ ఫలితాలపై కేటీఆర్ రియాక్షన్ - KTR Tweet On Election Results

BRS Working President KTR On Election Results : లోక్​సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్​ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోషల్​ మీడియా 'ఎక్స్'​ వేదికగా స్పందించారు. లోక్‌​సభ ఎన్నికల ఫలితాలు తీవ్రంగా నిరుత్సాహపరిచాయని అన్నారు. అయినా నిరంతరాయంగా శ్రమించి పార్టీకి పునర్వైభవం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

BRS Working President KTR On Election Results
BRS Working President KTR On Election Results (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 6:04 PM IST

Updated : Jun 4, 2024, 7:17 PM IST

BRS Working President KTR On Election Results : లోక్​సభ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశ పరిచాయని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. ఫీనిక్స్ పక్షి తరహాలో మళ్లీ పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన పార్టీ స్థాపించిన 24 ఏళ్ల సుదీర్ఘమైన ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూశామని గుర్తు చేశారు.

KTR On Election Results : అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం పార్టీకి ఉందన్న కేటీఆర్, బీఆర్ఎస్​ పార్టీగా తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటాన్ని మించిన గౌరవం, విజయం మరేది లేదని తెలిపారు. గతంలోనూ ఇలాంటి ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ ప్రజాదరణతో బీఆర్ఎస్​ పుంజుకున్న సందర్భాలెన్నో ఉన్నాయని అన్నారు. తెలంగాణ సాధించటంతో పాటు ఒక ప్రాంతీయ పార్టీగా రెండుసార్లు అద్భుతమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని, 2014లో 63 సీట్లు, 2018లో 88 సీట్లలో గెలుపొందామని పేర్కొన్నారు.

అందరికీ కృతజ్ఞతలు : ప్రస్తుత శాసనసభలోనూ మూడో వంతైన 39 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్​ కొనసాగుతోందని, స్వల్ప తేడాతోనే ఓటమి పాలైందని వివరించారు. ఆర్నెళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు నిరాశ కలిగించినప్పటికీ లోక్​సభ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రమించారన్న కేటీఆర్, వారందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనని, గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడినప్పుడు కుంగిపోవద్దని అధినేత కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారని అన్నారు.

బీఆర్ఎస్​ అదే సిద్ధాంతాన్ని పాటిస్తుందని తెలిపారు. ఇప్పుడు వచ్చిన ఫలితాలు కచ్చితంగా నిరాశ పరిచాయని, అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కుంగిపోయేది లేదని కేటీఆర్ తెలిపారు. ఎప్పటిలాగే ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని, ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి వారి బాధ్యతను గుర్తు చేస్తూనే ఉంటామని చెప్పారు.

ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున పోరాడుతూనే ఉంటాం : ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజాక్షేత్రంలో తెలంగాణ ప్రజల తరపున పోరాడుతూనే ఉంటామన్న ఆయన, తెలంగాణ ప్రజల గొంతుక బీఆర్ఎస్​ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​పై తెలంగాణ ప్రయోజనాల కోసం అటు కేంద్రంతోనూ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు. రానున్న రోజుల్లో మరింతగా కష్టపడి, మళ్లీ ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని, ఫినిక్స్ పక్షిలాగా తిరిగి పుంజుకుంటామని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

KTR congratulated TDP chief Chandra Babu : ఏపీ శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు, జనసేన అధినేత పవన్​ కల్యాణ్​కు కేటీఆర్​ శుభాకాంక్షలు తెలిపారు. 'ఏపీ ప్రజలకు సేవలు చేయడంలో ఇరువురి పాలనా కాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను' అని ఎక్స్​లో పోస్ట్​ చేశారు.

నాలుగో తేదీన అసలైన ఫలితాలు​ వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా : కేటీఆర్ - KTR On EXIT Polls 2024

మొదటిసారి మోసపోతే వారి తప్పు - మరోసారి అదే జరిగితే మన తప్పు : కేటీఆర్

Last Updated : Jun 4, 2024, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.