ETV Bharat / politics

వైద్య రంగంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఓ అరుదైన విప్లవం : కేటీఆర్ - KTR Tweets On Health Sector - KTR TWEETS ON HEALTH SECTOR

KTR Tweets On Health Sector : సర్కారు ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందనే ధీమాను ప్రజలకు కేసీఆర్ కల్పించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'​ వేదికగా పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే వైద్యరంగంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఓ అరుదైన విప్లవంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

BRS Leader KTR Tweets On Health Sector
BRS Leader KTR Tweets On Health Sector (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 4:00 PM IST

BRS Leader KTR Tweets On Health Sector : సర్కారు దవాఖానాకు నేను రాను బిడ్డో అనే దుస్థితి నుంచి ప్రభుత్వ దవాఖానాలోనే మెరుగైన వైద్యం అందుతుంది అనే ధీమాను ప్రజలకు కేసీఆర్ కల్పించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. హ్యాష్ ట్యాగ్ తెలంగాణ దశాబ్ది అంటూ పోస్టు చేసిన ఆయన జననం నుంచి మరణం దాకా ప్రతి దశలో మన సర్కారు ఉన్నదన్న భరోసా బీఆర్ఎస్ కల్పించిందన్నారు.

కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, డయాలసిస్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు, బస్తీ దవాఖానలు, మాతాశిశు ఆసుపత్రులను అభివృద్ధి చేశామన్నారు. నగరం నలుమూలలా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వరంగల్​లో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రికి శ్రీకారం చుట్టిన ఘనత కేసీఆర్​దేనని కితాబులిచ్చారు. మరే రాష్ట్రంలో లేనన్ని మెడికల్ సీట్లు తీసుకువచ్చామన్న కేటీఆర్ దేశ చరిత్రలోనే వైద్యరంగంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఓ అరుదైన విప్లవంగా పేర్కొన్నారు.

ఉద్యోగాల కల్పనపై మేము సరిగా ప్రచారం చేసుకోలేదు - సామాజిక మాధ్యమాల్లో మాపై బాగా దుష్ప్రచారం చేశారు' - KTR on Congress Government

KTR Fires On CM Revanth Reddy : సీఎం రేవంత్​ రెడ్డిపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. తన(కేటీఆర్) బంధువుకు రూ.10 వేల కోట్ల కోవిడ్​ కాంట్రాక్ట్​ వచ్చిందని సీఎం ఆరోపించారన్నారు. సచివాలయం కింద నిజాం నగలు తవ్వుకున్నట్లు కథ అల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి నకిలీ వీడియోను సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం చేశారని కేటీఆర్ విమర్శించారు. నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న వ్యక్తిని జైలులో ఎందుకు పెట్టరని ప్రశ్నించారు.

KTR Comments On RTC Logo Issue : మరోవైపు ఆర్టీసీలోగో విషయంలో చెలరేగిన దుమారంపై కూడా కేటీఆర్​ ఎక్స్​ వేదికగా స్పందించారు. కాంగ్రెస్​కు అనుబంధంగా ఉన్నవారిపై కేసులు ఎందుకు పెట్టట్లేదని సామాజిక మాధ్యమం ఎక్స్​ వేదికగా డీజీపీ, ఆర్టీసీ ఎండీని కేటీఆర్ ప్రశ్నించారు. ఆర్టీసీ కొత్త లోగో చూపుతున్న వారిపై ఎందుకు కేసులు పెట్టట్లేదన్నారు. రాజకీయ పెద్దల మాటలు విని వేధిస్తే కోర్టుకు లాగుతామని హెచ్చరించారు.

కేసీఆర్ పాలన సాక్షిగా 'ఇది తెలంగాణ దశాబ్ది' - వెయ్యేళ్లయినా చెక్కు చెదరని పునాది : కేటీఆర్ - KTR TWEET ON TS DECADE DEVELOPMENT'

ఆర్టీసీ కొత్త లోగో చూపుతున్న కాంగ్రెస్ వాళ్లపై కేసులేవీ : కేటీఆర్‌ - KTR Tweet Today

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.