ETV Bharat / politics

రాష్ట్ర మహిళా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరవుతా : కేటీఆర్‌ - KTR Responded Commission Notices

KTR Responded to State Women Commission Notices : రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులపై బీఆర్ఎస్ సీనియర్ నేత కేటీఆర్‌ స్పందించారు. ఈనెల 24 న కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతానని తెలిపారు. గత 8 నెలల్లో మహిళలపై జరిగిన ఘటనల వివరాలు తీసుకెళ్తానని, తాను బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నోటీసులు ఇచ్చారని మాజీమంత్రి ఆక్షేపించారు. మరోవైపు రుణమాఫీపై మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్‌ ప్రభుత్వ రుణమాఫీ డొల్ల అని తేలిపోయిందని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై మున్ముందు ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టి పోరాటాలు చేస్తామని ప్రభుత్వానికి కేటీఆర్‌ హెచ్చరించారు.

KTR Comments On Loan Waiver
KTR Responded to State Women Commission Notices (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 17, 2024, 5:02 PM IST

KTR Responded to State Women Commission Notices : ఈనెల 24న రాష్ట్ర మహిళా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరవుతానని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ సర్కార్​ ఏర్పడిన ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో మహిళలపై జరిగిన అన్ని ఘటనల వివరాలు కమిషన్‌కు తెలియజేస్తానని చెప్పారు. తాను బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నోటీసులు ఇచ్చారన్నారు.

తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, బీఆర్ఎస్​ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను సీఎం, కాంగ్రెస్‌ నేతలు అన్న మాటలను కూడా మహిళా కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు కేటీఆర్‌ చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న తెలంగాణ మహిళా కమిషన్‌ శుక్రవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా కమిషన్‌ ముందు అటెండ్​ అవ్వాలని సూచించింది. ఈ మేరకు కమిషన్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా వెల్లడించింది.

రుణమాఫీ కోసం ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టి పోరాటాలు చేస్తాం : మరోవైపు రుణమాఫీ కోసం మాట్లాడిన మాజీమంత్రి కేటీఆర్​, రుణమాఫీ డొల్లగా తేలిపోయిందని ఎల్లుండి నుంచి క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తామని తెలిపారు. రుణమాఫీ కాని వివరాలు సేకరించి కలెక్టర్, అధికారులకు అందిస్తామని ప్రభుత్వం అప్పటికీ న్యాయం చేయకపోతే ప్రభుత్వ పెద్దలు, ముఖ్యులకు వివరాలు అందిస్తామని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ వెల్లడించారు.

అప్పటికి స్పందించకపోతే ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టి, పోరాటాలు చేస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశమన్న ఆయన, ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాల్లో కూడా వివరాలు సేకరిస్తామన్నారు. 60 శాతం రైతులకు రుణమాఫీ కాలేదని, వారు ఆశాభావంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం కూడా అందరికీ న్యాయం చేస్తుందన్న ఆశాభావంతో ఉన్నట్లు కేటీఆర్‌ చెప్పారు. అన్ని స్థాయిల నేతలు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తామని, వారం రోజుల్లో వివరాల సేకరణ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

KTR Comments On Loan Waiver : ఒక ఏడాది కడుపు కట్టుకుంటే రూ.41 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని సీఎం మొదట చెప్పారని, రుణమాఫీ రూ.49 వేల కోట్ల దగ్గర ప్రారంభం అయి రూ.17 వేల కోట్ల దగ్గర ముగించారంటూ ఎద్దేవా చేశారు. 28 లక్షల కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారని, కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రతి ఇంటిని తట్టి రుణమాఫీ గురించి వివరాలు తీసుకుంటామని, దాదాపుగా మిగిలిన 28 లక్షల మంది రైతుల వివరాలు తీసుకొని వంద శాతం రుణమాఫీ అయిందని అంటున్నారని కేటీఆర్‌ తప్పుబట్టారు.

'రుణం తీరలే - రైతు బతుకు మారలే - ప్రశ్నిస్తే దాడులు, నిలదీస్తే బెదిరింపులు' - KTR Comments On Loan waiver

ఒక్క రైతుతో చెప్పించినా రాజకీయాలు వదిలేస్తా - సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ ఛాలెంజ్ - KTR CHALLENGES CM REVANTH

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.