ETV Bharat / politics

గన్‌పార్క్ నుంచి అమరజ్యోతి వరకు బీఆర్ఎస్‌ క్యాండిల్‌ ర్యాలీ - అమరులకు అంజలి ఘటించిన కేసీఆర్‌ - BRS Candle Rally 2024 - BRS CANDLE RALLY 2024

KCR Participated in BRS Candle Rally : బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే హైదరాబాద్‌ గన్‌పార్క్‌ వద్దకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్యాండిల్‌ ర్యాలీని ప్రారంభించారు. గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

BRS Telangana Formation Day Celebrations
BRS Telangana Decade Celebrations 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 10:12 PM IST

Updated : Jun 1, 2024, 10:31 PM IST

BRS Telangana Formation Day Celebrations 2024 : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరజ్యోతుల ర్యాలీ పేరిట హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్‌పై ఉన్న అమరుల స్మృతిచిహ్నం వరకు ర్యాలీ సాగింది. ఉత్సవాల్లో భాగంగా మొదట బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పించారు.

KCR Participated in BRS Candle Rally
KCR Participated in BRS Candle Rally (ETV Bharat)

అమరులకు అంజలి ఘటించి కొవ్వొత్తులతో కేసీఆర్‌ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీమంత్రి హరీశ్‌రావు సహా ప్రజాప్రతినిధులు, గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి రవీంద్రభారతి మీదుగా అమరజ్యోతుల ర్యాలీ సాగించిన నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో పెద్దఎత్తున నడిచారు. ర్యాలీ ముందు వివిధ కళారూపాలకు చెందిన పలువురు కళాకారులు తమ ప్రదర్శనలతో పాల్గొన్నారు.

KCR Wishes to State People : వ్యక్తి గత ద్వేషాలకు తావివ్వకుండా, తెలంగాణ సమాజ ప్రగతి, సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అందించిన నిజమైన ప్రజాసంక్షేమ పాలన స్ఫూర్తి అందుకొని ముందుకు సాగడం ద్వారానే ప్రస్తుత ప్రభుత్వం అమరుల ఆకాంక్షలను నెరవేర్చగలదని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

స్వరాష్ట్రాన్ని సాధించిన చారిత్రక సందర్భాలు : స్వరాష్ట్రమై పదేళ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భంలో రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్న ఆయన, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రారంభించిన దశాబ్ది వేడుకలను ముగించుకునే సందర్భంలో అమరులకు ముందుగా నివాళి అర్పించినట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామిక వాతావరణంలో పార్లమెంటరీ పంథాలో బీఆర్ఎస్‌ అస్తిత్వ రాజకీయ వేదికగా ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు.

రాష్ట్ర సాధన కోసం భావజాల వ్యాప్తి సాగించి, తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను బోధించి, పోరాటంలో సబ్బండ వర్గాలను సమీకరించి అనేక వ్యూహాలు, ఎత్తుగడలతో కేంద్రాన్ని కదిలించామన్నారు. నాడు దేశంలోని మెజారిటీ రాజకీయ పార్టీలను ఒప్పించి, స్వరాష్ట్రాన్ని సాధించిన చారిత్రక సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు.

దేశానికి ఒక రోల్ మోడల్‌గా తెలంగాణ : ఎన్నో త్యాగాలకోర్చి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో పటిష్ఠ పరుచుకుంటూ సమర్థంగా పాలన అందించిన పదేళ్ల స్వయంపాలనకాలం దేశానికి అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్‌గా నిలిపిందని కేసీఆర్ వివరించారు. అమరుల త్యాగాలను వృథాగా పోనీయకుండా పదేళ్ల పాటు ప్రజల భాగస్వామంతో సాధించిన ప్రగతిని, ప్రజాసంక్షేమాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని ఆకాంక్షించారు.

అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళి అర్పించేందుకు శనివారం కొనసాగిన అమరజ్యోతుల ర్యాలీని విజయవంతం చేసినందునకు పార్టీ శ్రేణులు, తెలంగాణ వాదులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొని నాటి ఉద్యమ స్ఫూర్తిని చాటుతూ, విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

అప్పుడు రాష్ట్రంలో కరెంటు కోతలే లేకుండా చూసిన బీఆర్​ఎస్​ - ఇప్పుడు మళ్లీ చీకట్లోకి నెట్టేసిన కాంగ్రెస్ - KTR Tweet on Power Cuts in TG

దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు - నేడు గన్ పార్క్ నుంచి బీఆర్​ఎస్​ కొవ్వొత్తుల ర్యాలీ - BRS Telangana Decade Celebrations

Last Updated : Jun 1, 2024, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.