ETV Bharat / politics

కడియంను రాజకీయంగా భూ స్థాపితం చేయడమే లక్ష్యం : బీఆర్ఎస్ నేత రాజయ్య - BRS Rajaiah Fires On Kadiyam - BRS RAJAIAH FIRES ON KADIYAM

BRS Rajaiah Fires On Kadiyam : కడియం శ్రీహరికి నీతి నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనతో ప్రజాక్షేత్రంలో పోటీపడాలని బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య సవాల్ విసిరారు. హనుమకొండలో నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో కడియంను మించిన కుట్రదారులు ఉండరని ఆయన విమర్శించారు.

BRS Rajaiah Fires On Kadiyam
BRS Rajaiah Fires On Kadiyam
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 7:47 PM IST

BRS Rajaiah Fires On Kadiyam : కాంగ్రెస్ నేత కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ను నిండా ముంచడానికే కడియం శ్రీహరి ఆ పార్టీలో చేరారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించారు. హనుమకొండలో నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్‌లతో కలిసి ఆయన పాల్గొన్నారు.

దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారు : ఈ సందర్భంగా మాట్లాడిన తాటికొండ రాజయ్య రాజకీయాల్లో కడియంను మించిన కుట్రదారులు ఉండరన్నారు. ఆయన తన స్వార్థంకోసం దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని ఆరోపించారు. శ్రీహరికి నీతి నిజాయతీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనతో ప్రజాక్షేత్రంలో పోటీపడాలంటూ సవాల్ చేశారు. టీడీపీ హయాంలో ఘన్‌పూర్‌ టికెట్‌ను తిరస్కరించి కడియంను రాజకీయాల్లోకి తీసుకొచ్చానని ఇప్పుడు తనను రాజకీయంగా భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్న రాజయ్య ఉపఎన్నికల్లో కడియంను ఓడిస్తే ప్రజలంతా పూలదండలతో స్వాగతం పలికారని గుర్తు చేశారు. రాజకీయ బిక్షపెట్టిన ఎన్టీఆర్‌ను కూడా వెన్నుపోటు పొడిచిన చరిత్ర కడియం శ్రీహరికే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆ ఒప్పందాన్ని బద్దలు కొడతామని ఉద్ఘాటించారు.

"కడియం శ్రీహరి అంత చరిత్ర హీనుడు ఉండరు. రాబోయే వందేళ్లు ఈయన గురించి చెప్పే విధంగా మన తీర్పు ఉండాలి. దళితుడినని చెప్పి వారి ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా చేశారు. ఆయన శిలువలు పలువలు చేసి నా మనసును మార్చారు. రాజకీయాల్లో ప్రజల మొప్పు పొంది రావాలి కాని, మోసాలు, కుట్రలు చేయకూడదు. కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్‌ను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పనిచేస్తాను"- తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ నేత

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. పార్టీ శ్రేణులన్నీ ఊరురా వెళ్లి తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.

కడియంను రాజకీయంగా భూ స్థాపితం చేయడమే లక్ష్యం : బీఆర్ఎస్ నేత రాజయ్య

Rajaiah Comments on Kadiyam : 'ఇక నేను స్టేషన్​ ఘన్​పూర్​కు రావాల్సిన అవసరం లేదు'

'స్టేషన్​ఘన్​పూర్​ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తారన్న నమ్మకం ఉంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.